
రోహిత్ శర్మకు గాయం..
టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌లో టీమిండియా తన తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్ దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈ నెల 24వ తేదీన ఉంటుంది. ఈ దశలో టైటిల్ హాట్ ఫేవరెట్‌గా బరిలో దిగడానికి సిద్ధపడిన భారత క్రికెట్ జట్టుకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. స్టార్ ఓపెనర్, టీమిండియాకు కాబోయే కొత్త కెప్టెన్ రోహిత్ శర్మ టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌కు దూరమయ్యే ప్రమాదం ఏర్పడింది.

వరుణ్ వంతు
షార్జా స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను గాయపడ్డాడు. ఇన్నింగ్స్ 15వ ఓవర్‌లో ఫీల్డింగ్ చేస్తోన్న సమయంలో డైవ్ చేయడంతో అతని భుజానికి గాయమైంది. దీనితో గ్రౌండ్ వీడాడు. ఇప్పటిదాకా రోహిత్ శర్మ గాయంపై ఎలాంటి అప్‌డేట్ లేదు. ఈ పరిస్థితుల్లో మరో స్టార్ బౌలర్ వరుణ్ చక్రవర్తి ఫిట్‌నెస్ సమస్యను ఎదుర్కొంటున్నాడు. అతని మోకాళ్లల్లో సమస్యలు తలెత్తాయి. ఈ విషయాన్ని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ధృవీకరించింది కూడా.

మోకాళ్లలో నొప్పులు
అతని ఫిట్‌నెస్ అంశం ఆందోళనకరంగా ఉందని స్పష్టం చేసింది. ఫిట్‌నెస్ గ్రేటెస్ట్ కండిషన్‌లో లేదని తెలిపింది. అతని మోకాళ్లలో నొప్పులు ఉన్నట్లు ఫిట్‌నెస్ టెస్ట్‌లో తేలినట్లు బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. టీ20 ప్రపంచకప్ వంటి మెగా ఈవెంట్‌లో పాల్గొనడానికి సహకరించకపోవచ్చని నిర్ధారించాయి. టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌లో ఆడబోయే ప్లేయర్లు 100 శాతం ఫిట్‌నెస్‌ను కలిగి ఉండటం తప్పనిసరి. ఇందులో ఏ మాత్రం తేడా కొట్టినా.. జట్టులో చోటు కోల్పోక తప్పదు.

పెయిన్ మేనేజ్‌మెంట్‌పై ఫోకస్
మరి కొద్దిరోజుల్లో టీ20 ప్రపంచకప్ ఆరంభం కాబోతోన్న నేపథ్యంలో- వరుణ్ చక్రవర్తి సరిగ్గా ఇదే దుస్థితిని ఎదుర్కొంటున్నాడు. ప్రస్తుతం అతని పెయిన్ మేనేజ్‌మెంట్‌పై ఫోకస్ పెట్టామని, టోర్నమెంట్ ఆరంభం అయ్యే సమయానికి సానుకూల మార్పులు రావచ్చని ఆశిస్తున్నట్లు బీసీసీఐ వర్గాలు అంచనా వేశాయి. ప్రస్తుతం కోల్‌కత నైట్ రైడర్స్ మెడికల్ టీమ్ పర్యవేక్షణలో వరుణ్ చక్రవర్తి ఉన్నాడు. ఈ టీమ్ నుంచి అతని ఫిట్‌నెస్‌కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని, మెడికల్ డేటాను ఎప్పటికప్పుడు తెప్పించుకుంటోంది బీసీసీఐ.

పెయిన్ కిల్లర్ లేకుండా..
అతని కండిషన్ ఛార్ట్‌ను తెప్పించుకుంది. పెయిన్ కిల్లర్ లేకుండా తన నాలుగు ఓవర్ల కోటాను పూర్తి చేసే పరిస్థితిలో వరుణ్ చక్రవర్తి లేడని తెలుస్తోంది. ఫీల్డింగ్ చేసే సమయంలో అతను ఇబ్బందిగా కదులుతున్నాడనే విషయం తమ దృష్టికి వచ్చినట్లు బీసీసీఐ స్పష్టం చేసింది. ఈ పరిణామాల మధ్య వరుణ్ చక్రవర్తి.. చివరి నిమిషంలో టీ20 ప్రపంచకప్ స్క్వాడ్‌లో చోటు కోల్పోయే ప్రమాదం లేకపోలేదు.
ఇదివరకు ఆస్ట్రేలియా సిరీస్‌కు ఎంపికైన అతను భుజం నొప్పితో తప్పుకోవాల్సి వచ్చింది. భారత పర్యటనకు వచ్చిన ఇంగ్లాండ్ జట్టుతో సిరీస్ కోసం కూడా అతను ఎంపికైనప్పటికీ.. మోకాలి నొప్పితో వైదొలిగాడు. ఇప్పుడు మళ్లీ అదే తరహా దుస్థితిని అతను ఎదుర్కోవడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

భారత టీ20 ప్రపంచకప్ జట్టు
విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్‌కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్ చహర్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ. స్టాండ్ బై ప్లేయర్స్‌గా శ్రేయాస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహార్ సెలెక్ట్ అయ్యారు.


Click it and Unblock the Notifications
