Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఒక వికెట్ తీయలేకపోయారు: పింక్ బాల్ టెస్ట్‌లో భారత స్పిన్నర్ల చెత్త రికార్డు!

IND vs BAN,2nd Test : Indians Spinners Worst Record During Pink Ball Test ! || Oneindia Telugu
IND Vs BAN, Day-Night Test: Indian spinners have gone wicketless in a home Test for only the second time

హైదరాబాద్: భారత్‌లో తొలి డే నైట్ టెస్టు మ్యాచ్ ముగిసింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన ఈ పింక్ బాల్ టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 46 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ డే నైట్ టెస్టులో కోహ్లీసేన విజయం సాధించడంతో అనేక రికార్డులను బద్దలు కొట్టడంతో పాటు పలు రికార్డులను సైతం నెలకొల్పింది.

ఈ డే నైట్ టెస్టు మ్యాచ్‌లో పింక్ బాల్‌తో ఆడటంతో టెస్టు మ్యాచ్ ప్రారంభానికి ముందు బంతి ఏ విధంగా ప్రవర్తిస్తుందోనని సందేహాలు తలెత్తాయి. ఇప్పటివరకు టెస్టుల్లో ఎర్రబంతితో రాణించిన పేసర్లు ఈ పింక్ బాల్‌తో ఏ మేరకు ప్రభావం చూపుతారనే చర్చ కూడా జరిగింది. వాటిని పటాపంచాలు చేస్తూ పింక్ బాల్ టెస్టులో పేసర్లు చెలరేగిపోయారు.

తమ పదునైన బౌన్సర్లతో

తమ పదునైన బౌన్సర్లతో

టీమిండియా పేసర్లు మహ్మద్‌ షమీ, ఇషాంత్‌ శర్మ, ఉమేశ్‌ యాదవ్‌లు తమ పదునైన బౌన్సర్లతో ప్రత్యర్ధి జట్టు బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపించారు. ఈ పింక్ బాల్ టెస్టులో స్పిన్నర్లతో పోలిస్తే పేసర్లే తమ ఆధిపత్యాన్ని చాటారు. ఈ టెస్టులో భారత్‌ పేసర్లు సాధించిన వికెట్లు 19. ఇక, స్పిన్నర్‌ తీసింది ఒక్కటే వికెట్‌.

స్పిన్నర్‌కు ఒకే ఒక వికెట్

స్పిన్నర్‌కు ఒకే ఒక వికెట్

అది కూడా బంగ్లాదేశ్‌కు చెందిన తైజుల్‌ పడగొట్టాడు. భారత జట్టులోని అశ్విన్‌, జడేజా లాంటి మేటి స్పిన్నర్లు సైతం వికెట్‌ తీయలేకపోయారు. బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్‌కు ఆ అవకాశం వచ్చినప్పటికీ రహానే క్యాచ్ మిస్ చేశాడు. అంతేకాదు ఈ డే నైట్ టెస్టులో స్పిన్నర్లకు పెద్దగా బౌలింగ్‌ చేసే అవకాశమే రాలేదు.

భారత స్పిన్నర్లు వేసిన ఓవర్లు ఇవే

భారత స్పిన్నర్లు వేసిన ఓవర్లు ఇవే

దీంతో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి అశ్విన్, జడేజాలు వేసిన ఓవర్లు 7 మాత్రమే. ఈ నేపథ్యంలో భారత స్పిన్నర్ల ఖాతాలో ఓ చెత్త రికార్డు నమోదైంది. స్వదేశంలో ఇప్పటివరకూ జరిగిన టెస్టు మ్యాచ్‌ల పరంగా చూస్తూ ఒక టెస్టులో భారత స్పిన్నర్లు కనీసం వికెట్‌ కూడా సాధించకుండా ఉండటం ఇదే రెండోసారి మాత్రమే.

శ్రీలంకతో ఇదే వేదికపై జరిగిన టెస్టులో

శ్రీలంకతో ఇదే వేదికపై జరిగిన టెస్టులో

గతంలో శ్రీలంకతో ఇదే వేదికపై జరిగిన టెస్టులో పేసర్లే మొత్తం వికెట్లను తీశారు. 2017-18 సీజన్‌లో జరిగిన ఆ టెస్టులో భారత పేసర్లే 17 వికెట్లను సాధించారు. అయితే ఆ మ్యాచ్‌ డ్రాగా ముగియగా స్పిన్నర్లకు వికెట్లు దక్కలేదు. ఆనాటి మ్యాచ్‌లో పేసర్లు మహ్మద్‌ షమీ, ఉమేశ్‌ యాదవ్‌, భువనేశ్వర్‌ కుమార్‌లు మొత్తం వికెట్లలో భాగస్వామ్యం అయ్యారు.

19 వికెట్లు తీసిన భారత పేసర్లు

19 వికెట్లు తీసిన భారత పేసర్లు

ఈడెన్ గార్డెన్స్ వేదికగా ముగిసిన డే నైట్ టెస్టులో సైతం భారత పేసర్లు రెండు ఇన్నింగ్స్‌లు కలుపుకుని 19 వికెట్లు పడగొట్టారు. అత్యధికంగా ఇషాంత్‌ శర్మ మొత్తం 9 వికెట్లు సాధించగా, ఉమేశ్‌ యాదవ్‌ 8 వికెట్లు దక్కించుకున్నాడు. మహ్మద్‌ షమీకి రెండు వికెట్లు లభించాయి.

Story first published: Monday, November 25, 2019, 12:09 [IST]
Other articles published on Nov 25, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+