
2010లో అరంగేట్రం
రాహుల్ శర్మ 2006లో పంజాబ్ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్ అరంగేట్రం చేశాడు. అద్భుత ప్రదర్శన కారణంగా 2010లో అప్పటి ఐపీఎల్ ప్రాంచైజీ డెక్కన్ ఛార్జర్స్ జట్టుకు ఎంపికయ్యాడు. ఆపై ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ మరియు పూణే వారియర్స్ జట్లకు కూడా రాహుల్ ఆడాడు. కొన్ని మంచి ప్రదర్శలు చేశాడు. అయితే 2012లో ఓ రేవ్ పార్టీ అతని కెరీర్‌ను నాశనం చేసింది. ఆ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నట్లు తేలడంతో ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడే అతడి కెరీర్‌కు పులిస్టాప్ పడింది.

4 వన్డేల్లో, 2 టీ20ల్లో ప్రాతినిథ్యం:
34 ఏళ్ల రాహుల్ శర్మ టీమిండియాకు 4 వన్డేల్లో, 2 టీ20ల్లో ప్రాతినిథ్యం వహించాడు. వన్డేల్లో 6, టీ20ల్లో 3 వికెట్లు పడగొట్టాడు. 2012లో చివరిసారిగా భారత్ తరఫున మ్యాచ్ ఆడాడు. ఇక 2014లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టుకు చివరగా ఐపీఎల్‌లో ఆడాడు. రూ. 50 లక్షల కనీస ధరతో 2021 వేలంలోకి వచ్చిన శర్మను ఏ ప్రాంచైజీ కూడా కొనుగోలుచేయలేదు. అయితే టీమిండియాకు మళ్లీ ఆడాలనే తన తండ్రి కలను నెరవేరుస్తానని రాహుల్ ధీమా వ్యక్తం చేశాడు.
సారీ నాన్నా
'సారీ నాన్నా.. కరోనా నుంచి నిన్ను కాపాడుకోలేకపోయా. చాలా భాధగా ఉంది. నువ్వు లేకుండా నా జీవితం ఎప్పటిలాగే ఉండదు. నేను నా జీవితంలో ప్రతి ఒక్క విషయం నీ నుంచే నేర్చుకున్నా. పోరాడే శక్తి, విల్ పవర్, హార్డ్ వర్క్ డెడికేషన్.. ఇలా ప్రతి ఒక్కటీ నీ నుంచే నేర్చుకున్నా. దేవుడా.. నా తండ్రిని జాగ్రత్తగా చూసుకో' అని రాహుల్ శర్మ ట్విటర్‌లో పేర్కొన్నాడు. 'టీమిండియాకు మళ్లీ ఆడాలనే నా తండ్రి కలను నెరవేరుస్తా' అని మరో ట్వీట్ చేశాడు.

కరోనాకు మళ్లీ కోరలు
దేశంలో తగ్గముఖం పట్టినట్లే కన్పించిన కరోనా.. ఇటీవల మళ్లీ కోరలు ఛాస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. దేశంలో నమోదవుతున్న రోజువారీ కేసుల్లో దాదాపు 65శాతం కేసులు ఒక్క మహారాష్ట్రలోనే ఉండటం కలవరపెడుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 35871 మంది వైరస్ బారిన పడగా.. ఇందులో 23179 కేసులు (64.6శాతం) మహారాష్ట్ర నుంచే ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశంలో ప్రస్తుతం 2,52,364 యాక్టివ్ కేసులుండగా.. ఇందులో 1.52లక్షల క్రియాశీల కేసులు మహారాష్ట్రలోనే ఉన్నాయి.


Click it and Unblock the Notifications
