For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రిటైర్మెంట్ ప్రకటించిన భారత స్టార్ క్రికెటర్

Piyush Chawla: భారత స్టార్ లెగ్ స్పిన్నర్ పీయూష్ చావ్లా క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ అయ్యాడు. శుక్రవారం ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఈ విషయాన్ని ప్రకటించారు. 2007 టీ20 ప్రపంచ కప్, 2011 వన్డే ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టులో పీయూష్ చావ్లా భాగంగా ఉన్నాడు. పీయూష్ చావ్లా 2012లో భారత్ తరఫున చివరి మ్యాచ్ ఆడాడు. అయిత్ 2007 టీ20 ప్రపంచ కప్‌లో పీయూష్ చావ్లాకు ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. ఆటకు వీడ్కోలు చెప్పిన సందర్భంగా పీయూష్ చావ్లా తన కుటుంబానికి, అభిమానులకు, సహచర ఆటగాళ్లకు, కోచ్‌లు, బీసీసీఐకి కృతజ్ఞతలు చెప్పాడు. తనను నమ్మిన ఐపీఎల్ ఫ్రాంచైజీలు పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్‌లకు కృతజ్ఞతలు తెలిపాడు. ఐపీఎల్ తన కెరీర్‌లో ఒక ప్రత్యేక అధ్యాయమని.. తాను దానిలో ఆడుతున్న ప్రతి క్షణాన్ని ఎంతో ఆనందించానన్నారు.

పీయూష్ చావ్లా కెరీర్ ఇలా..
పీయూష్ చావ్లా 2006లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. పీయూష్ 2006లో మొహాలీలో ఇంగ్లాండ్‌తో టెస్ట్ మ్యాచ్‌గా తన మొదటి మ్యాచ్ ఆడాడు. తర్వాత 2007లో బంగ్లాదేశ్‌తో వన్డే అరంగేట్రం చేశాడు. 2010లో దక్షిణాఫ్రికాతో టీ20 అరంగేట్రం చేశాడు. పీయూష్ డిసెంబర్ 2012లో ఇంగ్లాండ్‌తో భారత్ తరఫున చివరి టెస్ట్ మ్యాచ్, 2011లో నెదర్లాండ్స్‌తో జరిగిన చివరి వన్డే, 2012లో వాంఖడే స్టేడియంలో ఇంగ్లాండ్ జట్టుతో చివరి టీ20 మ్యాచ్ ఆడాడు. దీని తర్వాత పీయూష్ చావ్లా టీమిండియాలో ఎప్పుడూ స్థానం సాధించలేకపోయాడు. అయితే పీయూష్ చావ్లా ఐపీఎల్‌లో ఆడటం కొనసాగించాడు. ఈ లీగ్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో ఒకడు.

Indian Spinner Piyush Chawla Announces Retirement from All Formats of Cricket

పీయూష్ చావ్లా భారత్ తరఫున మూడు టెస్టులు, 25 వన్డేలు, 7 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. పీయూష్ చావ్లా టెస్టుల్లో 7 వికెట్ల, వన్డేల్లో 32 వికెట్లు, టీ20ల్లో 4 వికెట్లు తీసుకున్నాడు. ఐపీఎల్‌లో 192 మ్యాచ్‌ల్లో 192 వికెట్లు పడగొట్టాడు. గత సంవత్సరం ముంబై ఇండియన్స్ జట్టులో పీయూష్ చావ్లా భాగంగా ఉన్నాడు. అయితే మెగా వేలానికి ముందే అతడిని విడుదల చేశారు. వేలంలో పీయూష్ చావ్లాను ఎవరూ అతడిని కొనుగోలు చేయలేదు. దీని తర్వాత పీయూష్ చావ్లా ఐపీఎల్‌లో వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించాడు.

Story first published: Friday, June 6, 2025, 15:54 [IST]
Other articles published on Jun 6, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+