Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కుల్దీప్ మరో నాలుగు వికెట్లు తీస్తే షమీ రికార్డు బద్దలు

Indian Spinner Kuldeep Yadav four short of 100 ODI wickets, break Mohammad Shamis record

పోర్ట్ ఆఫ్ స్పెయిన్: టీ20 సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసి వరుస విజయాలతో జోరుమీదున్న భారత్‌ మరో కీలక సమరానికి సిద్దమయింది. బుధవారం జరిగే చివరిదైన మూడో వన్డేలో వెస్టిండీస్‌తో తలపడుతుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ మొత్తం వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోగా.. రెండో వన్డేలో విజయం సాధించి 1-0తో సిరీస్‌ ఆదిక్యంలో ఉన్న భారత్‌ సిరీస్‌పై కన్నేసింది.

నాలుగు వికెట్లు తీస్తే:

నాలుగు వికెట్లు తీస్తే:

2017లో వెస్టిండీస్‌పై అరంగేట్రం చేసిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ (24) మూడో వన్డేలో మరో నాలుగు వికెట్లు తీస్తే.. వన్డేల్లో అత్యంత వేగంగా భారత్ తరపున 100 వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డుల్లోకి ఎక్కనున్నాడు. ఈ క్రమంలో పేసర్ మొహ్మద్ షమీ రికార్డును కూడా బద్దలు కొట్టనున్నాడు. ప్రస్తుతం కుల్దీప్‌ 53 వన్డేల్లో 96 వికెట్లు పడగొట్టాడు. మరోవైపు షమీ 55 వన్డేల్లో 100 వికెట్లు తీసి అందరికంటే ముందున్నాడు. ఈ మ్యాచ్‌లో కుల్దీప్‌ 4 వికెట్లు తీస్తే షమీ రెండవ స్థానంకు చేరుకోనున్నాడు.

 ప్రపంచకప్‌లో పేలవ ప్రదర్శన:

ప్రపంచకప్‌లో పేలవ ప్రదర్శన:

కుల్దీప్‌ రెండో వన్డేలో తన కోటా 10 ఓవర్లలో రెండు వికెట్లు తీసినా.. 59 పరుగులు సమర్పించుకున్నాడు. కుల్దీప్‌ ఈ రికార్డును ఐసీసీ ప్రపంచకప్‌లో సాధిస్తాడని అందరూ అనుకున్నారు. కానీ.. ఇంగ్లాండ్‌లో పేలవ ప్రదర్శన కారణంగా అతను ఈ మైలురాయిని చేరుకోలేకపోయాడు. కుల్దీప్‌ ప్రపంచకప్‌లోని 7 మ్యాచ్‌లలో కేవలం 6 వికెట్లు పడగొట్టాడు.

ద్రవిడ్‌కు విరుద్ధ ప్రయోజనాలు లేవు.. ఎన్‌సీఏ డైరెక్టర్‌గా మార్గం సుగమం

యువరాజ్‌ రికార్డుపై కన్ను:

యువరాజ్‌ రికార్డుపై కన్ను:

హిట్‌మ్యాన్ రోహిత్‌ శర్మ భారత మాజీ ఆటగాడు 'సిక్సర్ల వీరుడు' యువరాజ్‌ సింగ్‌ రికార్డుపై కన్నేశాడు. భారత్ తరపున వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా యువరాజ్‌ (8701) ప్రస్తుతం ఏడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఎనిమిదవ స్థానంలో ఉన్న రోహిత్‌ శర్మ (8676) మరో 26 పరుగులు చేస్తే యువరాజ్‌ను అధిగమించనున్నాడు. భారత్‌ తరపున వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో మాజీ దిగ్గజం సచిన్‌ టెందుల్కర్‌ (18426) మొదటి స్థానంలో ఉన్నాడు.

Story first published: Wednesday, August 14, 2019, 12:46 [IST]
Other articles published on Aug 14, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+