ఏది గొప్ప?: ఆసీస్ గడ్డపై టెస్టు సిరిస్ Vs 2011 వరల్డ్‌కప్ విజయం

హైదరాబాద్: ఆసీస్ గడ్డపై టెస్టు సిరిస్ విజయం, 2011 వరల్డ్ కప్ నెగ్గడం ఈ రెండింటిలో ఏది గొప్ప అన్న ప్రశ్నకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తనదైన శైలిలో బదులిచ్చాడు. 2011 ప్రపంచకప్ విజయం కంటే.. ఆసీస్‌పై టెస్టు సిరిస్ నెగ్గడం తనకు ఎంతో గొప్పదని కోహ్లీ పేర్కొన్నాడు. సిడ్నీ టెస్టు డ్రాగా ముగియడంతో విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను 2-1తో సొంతం చేసుకుంది.
దీంతో ఆసీస్ గడ్డపై కోహ్లీ సేన సరికొత్త చరిత్రను సృష్టించిన సంగతి తెలిసిందే. మ్యాచ్ అనంతరం కెప్టెన్ విరాట్ కోహ్లీ మీడియాతో మాట్లాడుతూ ఈ విజయం ఆసీస్ గడ్డపై టీమిండియాకి లభించిన గొప్ప గెలుపని అన్నాడు. ఈ సందర్భంగా టీమిండియా వరల్డ్‌కప్ సాధించిన క్షణాల్ని కూడా ఒకసారి నెమరవేసుకున్నాడు.
2011 వరల్డ్‌కప్ సాధించిన జట్టులో సభ్యుడినని
2011 వరల్డ్‌కప్ సాధించిన భారత జట్టులో తాను జట్టు సభ్యుడినని పేర్కొన్న కోహ్లీ.. అదొక చిరస్మరణీయమైన జ్ఞాపకమని చెప్పుకొచ్చాడు. అయితే, ఆ సమయంలో తానొక యువ క్రికెటర్‌ను మాత్రమేనని, ఆ వరల్డ్‌కప్ గెలిచిన ఆనంద క్షణాల్ని జట్టు సభ్యులు ఆస్వాదించడాన్ని స్వయంగా చూశానని అన్నాడు. కానీ వారు ఎలా ఫీలయ్యారో తనకు అప్పుడు తెలియదన్న కోహ్లీ, ఇప్పుడు ఓ కెప్టెన్‌గా చారిత్రక సిరీస్‌ను గెలిచిన సందర్భాన్ని తెగ ఎంజాయ్ చేస్తున్నానని అన్నాడు. ఇంత గొప‍్పగా తాను గతంలో ఎన్నడూ ఫీల్ అవ్వలేదని కోహ్లీ తెలిపాడు.
ఆసీస్ గడ్డపై విజయం సాధించాం
తాము ఏదైతే వ్యూహంతో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లామో దాన్ని కచ్చితంగా అమలు చేసి విజయం సక్సెస్ అయ్యామని అన్నాడు. తాము అన్ని విభాగాల్లోనూ సమష్టిగా రాణించడంతోనే ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలో ఓడించడం జరిగిందని కోహ్లీ పేర్కొన్నాడు. ముఖ్యంగా ఈ విజయంలో కీలకపాత్ర పోషించిన భారత బౌలర్లపై విరాట్ కోహ్లీ ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ సిరిస్‌లో భారత బౌలర్లలో బుమ్రా (21 వికెట్లు) అగ్రస్థానంలో నిలవగా షమీ 16 వికెట్లు, ఇషాంత్ శర్మ 11 వికెట్లు తీశారు.
నా జీవితంలోనే బెస్ట్ అచీవ్‌మెంట్
ఇక, ఆసీస్ గడ్డపై విజయం సాధించడాన్ని తన జీవితంలోనే బెస్ట్ అచీవ్‌మెంట్‌గా కోహ్లీ అభివర్ణించాడు. "టీమిండియాకు ఇంతకంటే గొప్ప విజయం మరొకటి ఉండదు. గత 12 నెలలుగా జట్టులో ఈ గెలుపు సంప్రదాయాన్ని కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఏడాది కాలంగా జట్టులో వచ్చిన సమతుల్యతోనే ఆసీస్‌ను వారి గడ్డపై ఓడించాం. అంతకుముందు జరిగిన రెండు విదేశీ పర‍్యటనల్లో కూడా మా జట్టు సత్తా చాటింది. భారత క్రికెట్ జట్టు ఈ స్థాయి ప్రదర్శనను నేను ఎప్పుడూ చూడలేదు" అని కోహ్లీ అన్నాడు.
డ్రాగా ముగిసిన సిడ్నీ టెస్టు
సిడ్నీ టెస్టు డ్రాగా ముగియడంతో విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను 2-1తో సొంతం చేసుకుంది. దీంతో ఆసీస్ గడ్డపై 72 ఏళ్ల విరామానికి టీమిండియా తెరదించింది. గత గురువారం సిడ్నీ వేదికగా ప్రారంభమైన చివరి టెస్టులో టీమిండియా విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ వర్షం పదే పదే అంతరాయ కలిగించడంతో పూర్తి ఆట సాధ్యం కాలేదు. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications