Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'ఐపీఎల్ ఓ విప్లవం, భూమి పైనే గొప్పది, దేవుడు పంపించాడు'

బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అనేది ఓ విప్లవమని, దేవుడు పంపించాడని న్యూజిలాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ డానీ మోరిసన్ అన్నాడు. ఐపీఎల్ అనేది భువి పైనే మంచి ట్వంటీ 20 టోర్నమెంట్ అని అభిప్రాయపడ్డాడు.

49 ఏళ్ల డానీ మోరిసన్ టీవీ కామెంటరీ టీమ్‌లో ఉన్నాడు. తన వ్యాఖ్యలతో అందర్నీ ఎంటర్‌టైన్ చేస్తుంటాడు. తన పైన వచ్చే విమర్శలను అతను పెద్దగా పట్టించుకోడు. మోరిసన్ 48 టెస్టులు, 96 వన్డేలు ఆడాడు.

'Indian Premier League (IPL) is a revolution and God sent'

తన వేషధారణ పైన ఎవరైనా కామెంట్ చేస్తే, తాను ఇలా వచ్చినందుకు సంతోషంగా ఉన్నానని చెబుతారు. డానీ మోరిసన్ ఐపీఎల్ అధికారిక వెబ్ సైట్‌కి రాస్తుంటారు. తాను మ్యాచ్‌తో పోటీగా ఎంటర్టైన్‌మెంట్ ఎందుకిస్తానో అతను చెప్పాడు.

ఐపీఎల్ అనేది ఎంతో మనోహరమైనదన్నాడు. ఇది ఓ రెవెల్యూష్ (విప్లవం) అన్నాడు. 70లలో కెర్రీ పాకర్ రెవెల్యూషన్ చూశామని, ఇప్పుడు టీ20ను చూస్తున్నామన్నాడు. ప్రతి ఒక్కరికి కూడా ఐపీఎల్ గురించి తెలుసునని, దీనిని అందరూ అర్థం చేసుకుంటున్నారని, అలాగే ప్రతి ఒక్కరి ప్రశంసిస్తున్నారన్నాడు. ట్వంటీ20ల్లో భూమి పైనే ది బెస్ట్ ఐపీఎల్ అని అందరు అంటున్నారన్నాడు.

తన వరకు ఐపీఎల్, ఇతర టీ 20లు దేవుడు పంపినవిగా భావిస్తానని చెప్పాడు. వ్యక్తిగతంగా తాను అన్ని ఫార్మాట్లకు కామెంటేటింగ్ చేయడానికి ఇష్టపడతానని చెప్పాడు. ఐపీఎల్లో మరింత ఉత్సాహంగా ఉంటుందన్నాడు.

ఇక్కడ బాలీవుడ్, క్రికెట్ కలిసిపోయిందని చెప్పాడు. క్రికెట్‌కు ముందు తాను వారాంతంలో ప్లానిటోరియంకు వెళ్లే వాడినని చెప్పాడు. గతంలో తాను చీర్ లీడర్స్‌తో కలిసి డ్యాన్స్ చేసేవాడినని చెప్పాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+