Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ కొత్త జట్లను దక్కించుకుంది వీరే: పోటీలో 11 కంపెనీలు

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2016లోకి రెండు కొత్త జట్లు వస్తున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల పైన వేటు పడిన నేపథ్యంలో మరో రెండు జట్ల కోసం బిసిసిఐ బిడ్లను ఆహ్వానించింది. కొత్తగా రానున్న జట్లను ఖరారు చేస్తూ బీసీసీఐ మంగళవారం మధ్యాహ్నం నిర్ణయం తీసుకుంది.

కొత్త జట్ల పేర్లను ప్రకటించడంతో పాటు ఆయా జట్లను దక్కించుకున్న యాజమాన్యాలను కూడా బీసీసీఐ ప్రకటించింది. ప్రముఖ మొబైల్ ఫోన్ల తయారీ దిగ్గజం ఇంటెక్స్ రాజ్‌కోట్ ఫ్రాంచైజీని దక్కించుకుంది. పుణే ఫ్రాంచైజీని గోయెంకా గ్రూప్ చేజిక్కించుకుంది.

Indian Premier League to get two new teams today

సంజీవ్ గోయెంకా రూ.16 కోట్లు వెచ్చించి రాజ్‌కోట్ జట్టును దక్కించుకోగా, పుణే ఫ్రాంచైజీ కోసం ఇంటెక్స్ సంస్థ రూ.10 కోట్లు వెచ్చించింది. ఐపీఎల్‌లోకి రావాలని చాలా కార్పొరేట్ దిగ్గజాలు ప్రయత్నించారు. కానీ, ఇంటెక్స్, గోయెంకా గ్రూపులు విజయం సాధించాయి.

ఐపీఎల్లో ఫ్రాంచైజీని దక్కించుకునేందుకు పదకొండు కంపెనీలు పోటీ పడ్డాయి. స్టార్ ఇండియా, వోడాఫోన్, చెట్టినాడ్, వీడియోకాన్, ఆర్పీజీ గ్రూప్ (హర్ష గోయెంగా గ్రూప్), ఆర్పీ (సంజీవ్ గోయెంకా గ్రూప్), ఎన్డీటీవీ, సెట్ మ్యాక్స్, ఐఎల్ అండ్ ఎఫ్ఎస్, వాద్వా గ్రూప్, సైకిల్ అగరబత్తిలు పోటీపడ్డాయి.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+