India vs Sri Lanka: ప్చ్.. సంజూ శాంసన్‌కు నో చాన్స్.. ఫస్ట్ వన్డే‌లో బరిలోకి దిగే గబ్బర్ సేన ఇదే!

హైదరాబాద్: మరో నాలుగు రోజుల్లో భారత్-శ్రీలంక మధ్య మూడు వన్డేల సిరీస్‌కు తెరలేవనుంది. విరాట్ కోహ్లీ నేతృత్వంలో భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనలో ఉండగానే శిఖర్ ధావన్ సారథ్యంలో మరో జట్టు లంక పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆటగాళ్ల మానసిక ఒత్తిడి తగ్గించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి ఈ టూర్‌ను ప్రయోగాత్మకంగా చేపట్టింది. ఐపీఎల్, భారత్ ఏ పరిమిత ఓవర్ల ఫార్మాట్ స్టార్లతో కూడిన ఓ జట్టును శ్రీలంక పర్యటనకు పంపించింది. ఈ జట్టుకు హెడ్ కోచ్‌గా నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ) డైరెక్టర్ రాహుల్ ద్రవిడ్‌ను పంపించింది. ఈ టూర్ సక్సెస్ అయితే భవిష్యత్తులోనూ ఏక కాలంలో రెండు జట్లను ఆడించాలని బీసీసీఐ భావిస్తోంది.

గత నెల చివర్లోనే శ్రీలంక గడ్డపై అడుగుపెట్టిన ధావన్ సేన సన్నాహకాలు కూడా మొదలుపెట్టింది. నెట్ సెషన్స్, ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్‌లతో ముమ్మరంగా సాధన చేస్తోంది. అయితే శ్రీలంకతో మంగళవారం(జులై 13) మొదలయ్యే తొలి వన్డేపై అప్పుడే చర్చ మొదలైంది. జట్టు కూర్పుపై క్రికెట్ విశ్లేషకులు తమ అంచనాలను వెల్లడిస్తున్నారు.

ప్చ్.. సంజూకు నో చాన్స్

ప్చ్.. సంజూకు నో చాన్స్

ప్రాక్టీస్ మ్యాచ్‌ల ఆధారంగా ద్రవిడ్ పర్యవేక్షణలోని టీమ్ మేనేజ్‌మెంట్ సైతం తుది జట్టుపై ఓ అంచనాకు వచ్చింది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో టీమిండియా అన్‌లక్కీ క్రికెటర్ అయిన సంజూ శాంసన్‌కు ఈ మూడు వన్డే సిరీస్‌లో కూడా నిరాశే ఎదురు కానుంది. అతనికి ప్రత్యామ్నాయంగా ఉన్న వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ మంచి ఫామ్‌లో ఉండటం.. ఇటీవల ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో అరంగేట్ర మ్యాచ్‌లోనే దుమ్ములేపడం, అంతేకాకుండా డొమెస్టిక్ క్రికెట్‌లో సత్తా చాటడం కలిసి రానుంది. అంతేకాకుండా సంజూ శాంసన్ నిలకడలేమి ఆట, అంతర్జాతీయ క్రికెట్‌లో సత్తా చాటకపోవడం కూడా ఇషాన్‌కు కలిసి రానుంది.

ఓపెనర్లుగా గబ్బర్, షా..

ఓపెనర్లుగా గబ్బర్, షా..

ఇక శ్రీలంకతో జరిగే తొలి వన్డేలో ఓపెనర్లుగా కెప్టెన్ శిఖర్ ధావన్, పృథ్వీ షా బరిలోకి దిగనున్నారు. అయితే మ్యాచ్ సమయానికి ఎవరైనా గాయపడితే తప్పా.. ఈ కాంబినేషన్‌పై ఎలాంటి సందేహం లేదు. కెప్టెన్‌గా, సీనియర్ ఓపెన్ శిఖర్ ధావన్‌ చోటుకు డోకా లేదు. ఇక పృథ్వీ షా ఇటీవల భీకర ఫామ్‌లో ఉన్నాడు. పైగా అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అనుభవం అతనికి ఉంది. అంతేకాకుండా ధావన్, పృథ్వీ షాలది సూపర్ హిట్ కాంబినేషన్. ఐపీఎల్‌లో ఈ ఇద్దరు విధ్వంసకర బ్యాటింగ్‌తో ఢిల్లీ క్యాపిటల్స్‌కు అద్భుతమైన ఆరంభాలు అందించారు. ఇక ప్రత్యామ్నాయ ఓపెనర్లుగా ఉన్న రుతురాజ్ గైక్వాడ్, దేవదత్ పడిక్కల్‌లు కొన్నాళ్లు నిరీక్షించాల్సిందే.

ఫస్ట్ డౌన్‌లో సూర్య...

ఫస్ట్ డౌన్‌లో సూర్య...

ఇక సూర్యకుమార్ యాదవ్ ఫస్ట్ డౌన్‌లో వచ్చే అవకాశం ఉండగా.. మనీష్ పాండే నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయవచ్చు. పరిస్థితులను బట్టి వీరి బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పు కూడా ఉండవచ్చు. కానీ ఈ ఇద్దరు తుది జట్టులో ఉండటం మాత్రం ఖాయం. సూర్యకుమార్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో అదరగొట్టాడు. అతనికి అవకాశం దక్కితే ఇదే తొతి వన్డే. మనీష్ పాండేకు ఇప్పటి వరకు సరైన అవకాశాలు దక్కలేదు. ఈ ఇద్దరికీ ఈ సిరీస్ చాలా కీలకం. వికెట్ కీపర్‌గా ఇషాన్ కిషన్ చోటుకు డోకా లేదు. ఆల్‌రౌండర్లుగా హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా చోటు దక్కించుకోనున్నారు. కృనాల్‌కు పోటీగా కృష్ణప్ప గౌతమ్ ఉన్నప్పటికీ.. అనుభవానికే టీమ్‌మేనేజ్‌మెంట్ ఓటు వేయనుంది.

పేసర్లు భువీ, దీపక్ చాహర్..

పేసర్లు భువీ, దీపక్ చాహర్..

టీమ్ ప్రధాన పేసర్లుగా వైస్ కెప్టెన్ భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్‌లు ఆడటం ఖాయం. ఈ ఇద్దరు 8, 9వ స్థానాల్లో బ్యాటింగ్ రానున్నారు. ఇక పిచ్ కండిషన్స్ బట్టి ఎక్స్‌ట్రా పేసర్‌ను తీసుకోవాలంటే నవ్‌దీప్ సైనీ, స్పిన్నర్ కావాలంటే వరుణ్ చక్రవర్తీకి చోటు దక్కవచ్చు. ఇక ఏకైక స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా యుజ్వేంద్ర చాహల్‌కు చోటు దక్కుతుంది. కుల్దీప్ యాదవ్‌కు మళ్లీ నిరాశే ఎదురవ్వనుంది. యువ పేసర్ చేతన్ సకారియా రిథమ్ బాగుండి.. ఒకే తరహా పేసర్లు ఇద్దరు ఎందుకని భావిస్తే చాహర్ ప్లేస్‌లో చోటు దక్కవచ్చు. కానీ అనుభవం దృష్ట్యా చాహర్‌కే ఎక్కువ అవకాశాలున్నాయి. ఓటమెరుగకుండా గబ్బర్ సేన గర్జిస్తే మాత్రం ప్రయోగాల పేరిట అందరికి అవకాశం రావచ్చు.

తుది జట్టు అంచనా..

తుది జట్టు అంచనా..

శిఖర్ ధావన్(కెప్టెన్), పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్, మనీష్ పాండే, ఇషాన్ కిషన్(కీపర్), హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్(వైస్ కెప్టెన్), దీపక్ చాహర్, నవ్‌దీప్ సైనీ/ వరుణ్ చక్రవర్తీ, యుజ్వేంద్ర చాహల్

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Friday, July 9, 2021, 19:51 [IST]
Other articles published on Jul 9, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X