ఎందుకు?: విజయ్ మాల్యాకు మొహం చాటేసిన టీమిండియా (ఫోటోలు)
హైదరాబాద్: ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ప్రస్తుతం టీమిండియా లండన్‌లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. జస్టిస్ అండ్ కేర్ అనే ఆర్గనైజేషన్ కోసం కెప్టెన్ కోహ్లీకి చెందిన విరాట్ కోహ్లీ ఫౌండేషన్ నిర్వహించిన 'ఛారిటీ డిన్నర్' కార్యక్రమానికి లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా హాజరు కావడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్ | ఫోటోలు | స్కోరు కార్డు
జస్టిస్ అండ్ కేర్ అనే సంస్ధ భారత్‌లో విరాట్ కోహ్లీ ఫౌండేషన్‌తో కలిసి పనిచేస్తోంది. ఈ ఛారిటీ కార్యక్రమానికి కెప్టెన్ కోహ్లీతో పాటు క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, టీమిండియా ఆటగాళ్లు రోహిత్ శర్మ, యువరాజ్ సింగ్, అశ్విన్, శిఖర్ ధావన్, దినేశ్ కార్తీక్, కేదార్ జాదవ్‌లతో పాటు సపోర్టింగ్ స్టాఫ్ కూడా హాజరయ్యారు.
దేశంలోని పలు బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయల రుణాలు తీసుకొని, వాటికి ఎగనామం పెట్టి ప్రస్తుతం లండన్‌లో లగ్జరీ జీవితాన్ని గడుపుతోన్న రుణ ఎగవేతదారుడు విజయ్ మాల్యా ఈ కార్యక్రమానికి హాజరు కావడంతో భారత ఆటగాళ్లు అసౌకర్యంగా ఫీలయ్యారు. అయితే మాల్యా రాకను ముందే తెలుసుకున్న భారత ఆటగాళ్లు మాల్యాకు దూరంగా ఉన్నారు. అనవసరం వివాదం ఎందుకు అనుకొని.. కాస్త ముందుగానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ కార్యక్రమానికి మాల్యా స్టయిల్‌గా సిగరెట్ తాగుతూ వస్తున్న వీడియో కూడా నెట్‌లో హల్‌చల్ చేస్తోంది.

కోహ్లీ ఛారిటీ ఈవెంట్‌లో విజయ్ మాల్యా
దీంతో ఎటువంటి వివాదానికి తావివ్వకుండా త్వరితగతిన కార్యక్రమాన్ని ముగించుకుని అక్కడి నుంచి వచ్చేశారు. టీమిండియా హాజరైన కార్యక్రమానికి విజయ్ మాల్యా హాజరవడంపై సోషల్ మీడియా నెజిటన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో కోహ్లీకి సంబంధించి బీసీసీఐ వివరణ ఇచ్చింది.

బీసీసీఐ వివరణ
'చూడండి. కోహ్లీ కానీ, అతని ఫౌండేషన్ కానీ మాల్యాను ఈ ఈవెంట్‌కు ఆహ్వానించలేదు. చారిటీ డిన్నర్‌లో టేబుల్‌ను ఎవరైతే బుక్ చేసుకుంటారో... వాళ్లు ఆహ్వానించి ఉండొచ్చు. టీమిండియా మాల్యాతో ఎలాంటి స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించబోదు' అని ఈ కార్యక్రమానికి హాజరైన బీసీసీఐ అధికార ప్రతినిధి చెప్పారు.

అందుకు కారణం విజయ్ మాల్యా
అంతేకాదు టీమిండియా వెంటనే ఇంటి దారి పట్టడానికి మాల్యా కూడా ఒక కారణమని ఆయన పేర్కొన్నారు. మాల్యా రాకతో ఆటగాళ్లు చాలా ఇబ్బందిగా ఫీలయ్యారని బీసీసీఐ వెల్లడించింది. కాగా, ఈ ఛారిటీ ఈవెంట్‌ని అలాన్ విల్కిన్స్ నిర్వహించాడు. ఈ కార్యక్రమం వ్యాఖ్యతగా ఐర్లాండ్ అంతర్జాతీయ క్రికెటర్ నిఆల్ ఓ బ్రెయిన్ వ్యవహరించారు.

భారత్-పాక్ మ్యాచ్‌లో సైతం
బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టి విదేశంలో విలాసవంతమైన జీవితం గడుపుతున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా గత ఆదివారం ఎడ్జిబాస్టన్ వేదికగా జరిగిన భారత్-పాక్ మ్యాచ్‌లో ప్రత్యక్షమైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌కి విజయ్ మాల్యా హాజరు కావడం జాతీయ మీడియాలో పెద్ద సెన్సేషన్ న్యూస్ అయింది.

కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించిన మాల్యా
తాజా ప్రచారంపై విజయ్ మాల్యా ట్విట్టర్ వేదికగా స్పందించాడు. ఎడ్జిబాస్టన్‌లో పాక్‌తో జరిగిన మ్యాచ్‌కు తాను రావడంపై మీడియా కవరేజి సెన్సేషనల్‌గా ఉందని, అయితే తాను మొత్తం అన్ని మ్యాచ్‌లకు వచ్చి భారత జట్టును అలరిస్తానని ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీపై మాల్యా ప్రశంసల్లో ముంచెత్తాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications