For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆసియా‌కప్‌లో సూర్యను ఊరిస్తున్న నంబర్ 1 ర్యాంకు.. భారత ప్లేయర్లను ఊరిస్తున్న కొన్ని మైలురాళ్లు ఇవే

Indian Players Reaching Some Milestones Ahead of Asia cup 2022

టీమిండియా తరఫున కేఎల్ రాహుల్, సురేష్ రైనా, దీపక్ హుడా, రోహిత్ శర్మ తర్వాత టీ20ల్లో సెంచరీ చేసిన ఐదో భారత బ్యాటర్‌గా సూర్యకుమార్ యాదవ్ నిలిచిన సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్‌తో ఇటీవల జరిగిన మూడో టీ20లో సూర్య ఈ ఘనత సాధించాడు. సూర్యకుమార్ యాదవ్ 2021లో తన టీ20 అరంగేట్రం చేశాడు. టీ20 ఫార్మాట్‌లో అతను ప్రస్తుతం మంచి ఫాంలో ఉన్నాడు. ప్రస్తుతం టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇప్పుడు యూఏఈలో జరగనున్న ఆసియా కప్‌లో పాల్గొనేందుకు స్కై సిద్ధమయ్యాడు.

ఈ టోర్నీలో అతను రాణిస్తే.. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్‌ పేరిట ఉన్న నంబర్ 1 టీ20 ర్యాంకును తన పేరిటకు మార్చుకునే వీలుంది. సూర్యకుమార్ యాదవ్‌తో పాటు.. చాలా మంది ఇతర భారత ఆటగాళ్లు కూడా ఆసియా కప్ టోర్నీకి ముందు పలు మైలురాళ్లకు చేరువయ్యారు. ఈ టోర్నీలో ఆయా మైలురాళ్లను ప్లేయర్లు అందుకునే వీలుంది. అవేంటో ఓసారి చూసేద్దామా..!

117 పరుగులు : రిషబ్ పంత్ అంతర్జాతీయ టీ20ల్లో 1000పరుగులు పూర్తి చేయడానికి ఇంకా 117పరుగులు అవసరం.
335 పరుగులు : కేఎల్ రాహుల్ అంతర్జాతీయ క్రికెట్‌లో 2000పరుగులు పూర్తి చేయడానికి 335పరుగుల దూరంలో ఉన్నాడు.
166 పరుగులు : హార్దిక్ పాండ్యా అంతర్జాతీయ టీ20ల్లో 1000 పరుగులు పూర్తి చేయడానికి ఇంకా 166పరుగుల దూరంలో ఉన్నాడు.

154 పరుగులు : దినేష్ కార్తీక్ అన్ని రకాల టీ20ల్లో 7000పరుగులు పూర్తి చేయడానికి ఇంకా 154పరుగులు చేయాలి. ఈ ఫీట్ సాధిస్తే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, సురేశ్ రైనా, ఎంఎస్ ధోని, శిఖర్ ధావన్, రాబిన్ ఉతప్ప తర్వాత ఈ మైలురాయిని చేరిన 7వ భారత బ్యాటర్‌గా అతను నిలుస్తాడు.

1 వికెట్ : రవీంద్ర జడేజా ఆసియా కప్‌లో భారత్‌ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలవడానికి కేవలం ఒక్క వికెట్ దూరంలో ఉన్నాడు. అతను ప్రస్తుతం 22వికెట్లతో ఇర్ఫాన్ పఠాన్‌ (22) కలిసి అత్యధిక ఆసియా కప్ టోర్నీ వికెట్లు తీసిన భారత బౌలర్‌గా ఉన్నాడు.

115 పరుగులు : సూర్యకుమార్ యాదవ్ అన్ని రకాల టీ20ల్లో 5000పరుగులు పూర్తి చేయడానికి ఇంకా 115పరుగులు బాదాలి.

Story first published: Friday, August 26, 2022, 16:02 [IST]
Other articles published on Aug 26, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+