For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భువనేశ్వర్ కుమార్ ఇంట్లో పెను విషాదం!!

Indian pacer Bhuvneshwar Kumar Father died Due To Cancer
Bhuvneshwar Kumar's Father కన్నుమూత.. IND VS ENG ఎంపిక కాకపోవడమే మంచిదైంది !! || Oneindia Telugu

మీరట్‌: టీమిండియా సీనియర్ బౌలర్, సన్​రైజర్స్ హైదరాబాద్​ పేసర్ భువనేశ్వర్ కుమార్ ఇంట్లో విషాదం నెలకొంది. భువనేశ్వర్ తండ్రి కిరణ్ పాల్ సింగ్​ గురువారం కన్నుమూశారు. ఆయన వయసు 63. క్యాన్సర్​తో గతకొన్నిరోజులుగా పోరాడుతున్న ఆయన ఈరోజు మీరట్‌లోని ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. దీంతో భువీ ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి. కిరణ్​పాల్ సింగ్ ఉత్తరప్రదేశ్​లో పోలీస్​ శాఖలో సబ్​ ఇన్​స్పెక్టర్‌గా​ పనిచేసి.. కొన్నేళ్ల క్రితం రిటైరయ్యారు. ఇక కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఇటేవలి కాలంలో భారత పురుష, మహిళా ప్లేయర్స్ తమ కుటుంబ సభ్యులను కోల్పోతున్నారు.

63 ఏళ్ల కిరణ్ పాల్ సింగ్ గతకొన్నిరోజులుగా లివర్ క్యాన్సర్​తో బాధపడుతున్నారు. నోయిడా మరియు ఢిల్లీలో అయన మెరుగైన కీమోథెరపీ చికిత్స కూడా చేయించుకున్నారు. కొన్ని వారాల క్రితం పాల్ సింగ్ ఆరోగ్యం మరింత క్షీణించింది. దీంతో మీరట్‌లోని ఆసుపత్రిలో చేరారు. ఆపై మెరుగైన వైద్యం కోసం ముజఫర్ నగర్‌లోని మరొక ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కిరణ్ పాల్ సింగ్ ఈరోజు కన్నుమూశారు. ఐపీఎల్ 2021 వాయిదా పడడంతో ఇంటికి చేరుకున్న భువనేశ్వర్ కుమార్.. తన తండ్రిని దగ్గరుండి చూసుకున్నాడు.

టీమిండియా అద్భుతమైన పేసర్లలో భువనేశ్వర్‌ కుమార్‌ ఒకడు. ఇన్నింగ్స్ ఆరంభంలో, డెత్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేస్తూ.. వికెట్లు తీసి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. పిచ్‌లపై పచ్చిక.. వాతావరణం చల్లగా.. తేమతో వుంటే అతడిని ఆపడం కష్టమే. బంతిని రెండు వైపులా స్వింగ్‌ చేస్తూ.. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తిస్తుంటాడు. ఇంగ్లండ్, న్యూజీలాండ్ వంటి దేశాలు భువీ బౌలింగ్‌కు సరిగ్గా సరిపోతాయి. కానీ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్, ఇంగ్లండ్ పర్యటనకు భువీ ఎంపికకాలేదు. టెస్ట్ జట్టును ప్రకటించినప్పటి నుంచి.. సీనియర్ పేసర్ అయినప్పటికీ జాతీయ జట్టు తరఫున ఆడే అవకాశం అతడికి ఎందుకు లేకుండా పోయిందనే దానిపై చాలా చర్చలు జరిగాయి.

భువనేశ్వర్‌ కుమార్‌ గత రెండున్నరేళ్లుగా గాయాల బారిన పడుతున్న విషయం తెలిసిందే. 2018 జనవరి నుంచి భువీ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్టే ఆడలేదు. ఆ ఏడాది జనవరి 24-27 మధ్యన దక్షిణాఫ్రికాతో టెస్టు మ్యాచే చివరిది. పరిమిత ఓవర్ల క్రికెట్లో డెత్‌ ఓవర్లలో అతడి సామర్థ్యం పెరగడంతో.. బీసీసీఐ టీ20, వన్డేలకు ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చింది. గతేడాది ఐపీఎల్‌లో గాయపడటంతో కీలకమైన ఆస్ట్రేలియా సిరీస్‌కు దూరమయ్యాడు. ఆపై ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల క్రికెట్లో అవకాశం ఇచ్చారు. భారత్ తరఫున భువీ 21 టెస్టులు, 117 వన్డేలు, 48 టీ20లు ఆడాడు. మూడు ఫార్మాట్‌లలో కలిపి 246 వికెట్లు పడగొట్టాడు.

Story first published: Thursday, May 20, 2021, 19:50 [IST]
Other articles published on May 20, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+