క్రికెట్ బంతి తగిలి మరణించిన భారత సంతతి అంపైర్..!
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ మృతి మరవకముందే ఇజ్రాయెల్‌లో ఓ అంపైర్ బంతి తగిలి మృతి చెందాడు. ఈ విషాద ఘటనలో మృతి చెందిన 55ఏళ్ల ఇజ్రాయెల్ అంఫైర్ హిలెల్ అవాస్కర్ ప్రవాస భారతీయుడు కావడం విశేషం.
ముంబైలో జన్మించిన హిలెల్ అవాస్కర్ పన్నండేళ్ల వయుసులో ఇజ్రాయెల్‌కు వలస వెళ్లాడు. ఆ దేశ జట్టు కెప్టెన్‌గా వ్యవహరించిన హిలెల్ అవాస్కర్ ఆ తర్వాత అంపైరింగ్‌ను కెరీర్‌గా ఎంచుకున్నాడు.
హిలెల్ అవాస్కర్ ఇజ్రాయెల్ తరుపున ఐదు ఐసీసీ ట్రోఫీల్లో పోటీపడ్డాడు. అశ్ దోద్ నగరంలో శనివారం ఓ స్థానిక మ్యాచ్‌లో బంతి నేరుగా హిలెల్ అవాస్కర్‌కు తగలడంతో ఈ దుర్ఘటన జరిగింది. బ్యాట్స్‌మన్ కొట్టిన బలమైన షాట్‌కు ఆ బంతి బౌలర్ ఎండ్‌లో నిలబడిన 55 ఏళ్ల అంపైర్ ముఖానికి నేరుగా వచ్చి తగిలింది.

దీంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతని ప్రాణం డెడ్లీ బాల్ తీసింది. అతను బంతి తగలగానే అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు. దీంతో హుటాహుటిన దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు.
కానీ, అతను మృతి చెందాడు. బ్యాట్స్‌మన్ కొట్టిన బంతి వికెట్లకు తగిలి బౌన్స్ అయి, బౌలింగ్ ఎండ్‌లో ఉన్న అంపైర్ ఛాతి పైన బలంగా తాకిందని, దీంతో కిందపడిన ఆ అంపైర్ హార్ట్ ఎటాక్‌కు గురయ్యాడని ఓ ఆటగాడు తెలిపాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications