Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Tanveer Sangha: ఆస్ట్రేలియా ప్రపంచకప్ జట్టలో డ్రైవర్ కొడుకు.. నాల్గో భారత సంతతి ఆటగాడిగా సంఘా..

భారత సంతతికి చెందిన అన్‌క్యాప్‌డ్ లెగ్ స్పిన్నర్ తన్వీర్ సంఘా ఈ ఏడాది చివర్లో భారత్‌లో జరగనున్న వన్డే ప్రపంచకప్ కోసం 18 మంది సభ్యులతో కూడిన ఆస్ట్రేలియా జట్టులో చోటు దక్కించుకున్నాడు. తర్వాత జట్టును 15 మందికి కుదించనున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. సిడ్నీలో పుట్టి పెరిగిన, మిస్టరీ రిస్ట్ స్పిన్నర్ సంఘా 1990లలో పంజాబ్‌లోని జలంధర్ నుంచి ఆస్ట్రేలియాకు వలస వెళ్లిన భారతీయ కుటుంబానికి చెందినవాడు. అతని తండ్రి జోగా టాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతని తల్లి అప్నీత్ అకౌంటెంట్ గా పని చేస్తున్నారు. గురిందర్ సంధు, స్టువర్ట్ క్లార్క్, బ్రాన్స్‌బీ కూపర్ తర్వాత ఆస్ట్రేలియాకు ఎంపికైన నాల్గో భారత సంతతి ఆటగాడు సంఘా నిలిచాడు.

21 ఏళ్ల సంఘ సిడ్నీ థండర్ కోసం T20 క్రికెట్‌లో ఆడారు. ఐదు లిస్ట్ A మ్యాచ్ లు కూడా ఆడాడు. 2020-2021 బిగ్ బాష్ లీగ్‌లో సంఘ 21 వికెట్లు పడగొట్టాడు. తర్వాతి సీజన్‌లో 16 వికెట్లు తీశాడు. 2020 అండర్-19 ప్రపంచ కప్‌లో అత్యధిక వికెట్లు తీసిన వారిలో సంఘా ఒకడు. ఆరు మ్యాచ్ ల్లో రెండుసార్లు నాలుగు వికెట్లు, ఒకసారి ఐదు వికెట్లు తీశాడు. ICC నిబంధనల ప్రకారం ఆస్ట్రేలియా సెప్టెంబర్ 28లోపు జట్టులను ఖరారు చేయాలి. ఈ ఏడాది ప్రపంచకప్‌లో ఆతిథ్య భారత్‌తో చెన్నైలో అక్టోబర్ 8న జరగనుంది.

Indian-origin Tanveer Sangha has been selected for Australias World Cup squad

వచ్చే నెలలో దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌తో ఆస్ట్రేలియా ప్రపంచ కప్‌కు సిద్ధమవుతుంది. ఆ మ్యాచ్‌ల సమయంలో తన్వీర్ వంటి వారికి ఆకట్టుకునే అవకాశం ఇవ్వనున్నారు. కమిన్స్ గైర్హాజరీలో, దక్షిణాఫ్రికాలో జరిగే టీ20 సిరీస్‌లో ఆస్ట్రేలియాకు మిచెల్ మార్ష్ నాయకత్వం వహించనున్నాడు. తన్వీర్ ఇప్పటిటికే ఆస్ట్రేలియా జట్టుకు ఎంపికైనప్పటికీ అతను ఇంకా అరంగేట్రం గెలవలేదు. స్పిన్ అనుకూలమైన భారత పిచ్‌లలో అష్టన్ అగర్, ఆడమ్ జంపాతో కలిసి మరొక స్పిన్ ఎంపిక కావచ్చు.

ఆస్ట్రేలియా వన్డే జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్), సీన్ అబాట్, అష్టన్ అగర్, అలెక్స్ కారీ, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, ఆరోన్ హార్డీ, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, తన్వీర్ సంఘా, స్టీవ్ స్మిత్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా

Story first published: Tuesday, August 8, 2023, 12:25 [IST]
Other articles published on Aug 8, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+