న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధావన్‌ మెడకు గాయం.. బాల్‌ పగిలిందేమో చూడంటున్న గబ్బర్!!

Shikhar Dhawan Gets Hit On Neck, Makes Hilarious Comment Soon After
Indian opener Shikhar Dhawan gets hit on neck, makes hilarious comment

హైదరాబాద్: టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ ప్రపంచకప్-2019లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచులో తీవ్ర గాయం అయినా.. బ్యాటింగ్ అలాగే కొనసాగించి సెంచరీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ధావన్‌కు మళ్లీ గాయమయినా.. అదేమీ లెక్కచేయకుండా బ్యాటింగ్ చేసాడు. అంతేకాదు సహచర ఆటగాడితో జోక్ పేల్చాడు. విషయంలోకి వెళితే.

షోకాజ్‌ నోటీసులు.. బీసీసీఐకి క్షమాపణలు చెప్పిన దినేశ్‌ కార్తీక్‌షోకాజ్‌ నోటీసులు.. బీసీసీఐకి క్షమాపణలు చెప్పిన దినేశ్‌ కార్తీక్‌

తాజాగా దక్షిణాఫ్రికా-ఎతో జరిగిన ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను భారత్-ఎ 4-1 తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. శుక్రవారం తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్‌ ఇంటర్నేషన్‌ స్టేడియంలో జరిగిన చివరి వన్డేలో భారత్ 36 పరుగులతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో సంజు శాంసన్‌ (48 బంతుల్లో 91; 6 ఫోర్లు, 7 సిక్సర్లు), శిఖర్‌ ధావన్‌ (36 బంతుల్లో 51; 5 ఫోర్లు, 2 సిక్సర్లు)లు చెలరేగడంతో భారత్ 204 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారీ లక్ష్య ఛేదనకు బరిలో దిగిన దక్షిణాఫ్రికా-ఏ 20 ఓవర్లలో 168 పరుగులకు ఆలౌటైంది.

అయితే ఈ మ్యాచ్‌లో ధావన్‌కు గాయమైంది. పేసర్‌ హెండ్రిక్స్‌ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్లోని ఓ బంతిని ధావన్‌ స్కూప్‌ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ.. బంతి నేరుగా వచ్చి అతడి మెడకు బలంగా తగిలింది. గాయమైనా అతడు తన బ్యాటింగ్ కొనసాగించాడు. దీనికి సంబందించిన వీడియోను గబ్బర్ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్ చేసాడు. 'మనం పడిపోతాం.. గాయపడతాం.. విఫలమవుతాం. అయినా.. తిరిగి పైకిలేస్తాం.. కోలుకుంటాం.. విజయం సాధిస్తాం' అని రాసికోచ్చాడు.

దీనిపై సంజు శాంసన్‌ స్పందించాడు. 'ధావన్‌కు గాయమైన తర్వాత క్రీజులో ఉన్న నా దగ్గరికి వచ్చి.. బంతి పగిలిపోయిందేమో చూడు అని అన్నాడు' అని కామెంట్‌ చేశాడు. ధావన్‌ గాయంతో బాధపడుతూ కూడా జోక్‌ పేల్చడం విశేషం. ఈ నెల 15 నుంచి స్వదేశంలో దక్షిణాఫ్రికాతో టీమిండియా మూడు టీ20లు, మూడు టెస్టులు ఆడనుంది.

Story first published: Sunday, September 8, 2019, 17:43 [IST]
Other articles published on Sep 8, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X