
2007లో తొలి అర్ధసెంచరీ..
టీ20 ఫార్మట్‌లో అతని దూకుడుకు అడ్డుకట్ట వేయాలంటే తాతలు దిగిరావాల్సిందే. అందుకే అభిమానులు అతణ్ని హిట్‌మ్యాన్‌గా పిలుస్తుంటారు. వన్డే, టీ20 ఫార్మట్‌లో పరుగుల వరదను పారించే రోహిత్ శర్మ.. తన కేరీర్‌లో తొలి అర్ధసెంచరీని 2007లో నమోదు చేశాడు. ఆ ఏడాది టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌లో అతను దక్షిణాఫ్రికా మీద ఈ ఘనతను సాధించాడు. 40 బంతుల్లో 50 పరుగులు చేశాడు. ఈ టోర్నమెంట్ అతని కేరీర్‌ను మలుపు తిప్పింది. వెనక్కి తిరిగి చూసుకోనివ్వకుండా చేసింది.

దినేష్ కార్తీక్ బ్యాట్‌తో
సుదీర్ఘకాలం పాటు నిలకడగా రాణించడానికీ దోహదపడింది. రోహిత్ శర్మ ఫామ్‌ను కోల్పోయిన సందర్భాలు, సిరీస్‌లు చాలా తక్కువ. రోహిత్ శర్మ అర్ధసెంచరీని సాధించడం వెనుక.. దినేష్ కార్తిక్ హస్తం ఉంది. దినేష్ కార్తిక్ బ్యాట్‌తోనే రోహిత్ హాఫ్ సెంచరీ బాదాడు. ఈ విషయం పెద్దగా ఎవరికీ తెలియదు. బయటికి రానూ లేదు. తాజాగా దినేష్ కార్తీకే ఈ విషయాన్ని బయటపెట్టాడు. ఇవ్వాళ అతని పుట్టినరోజు. ఈ సందర్భంగా క్రికెట్ కామెంటేటర్ గౌరవ్ కపూర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డీకే దీని గురించి ప్రస్తావించాడు.

బయటపెట్టిన డీకే..
బ్రేక్ ఫాస్ట్ విత్ ఛాంపియన్స్ పేరుతో గౌరవ్ కపూర్ నిర్వహించిన ఫేస్ టు ఫేస్ కార్యక్రమానికి దినేష్ కార్తీక్ అటెండ్ అయ్యాడు. టీ20 ప్రపంచకప్ 2007 ఎడిషన్‌లో భాగంగా దక్షిణాఫ్రికా డర్బన్‌లోని కింగ్స్‌మీడ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ తన బ్యాట్‌తో రాణించాడని చెప్పాడు. అతను హాఫ్ సెంచరీ సాధించిన బ్యాట్ తనదేనని తేటతెల్లం చేశాడు. క్రీజ్‌లో దిగడానికి ముందు రోహిత్ శర్మ అసహనంతో కనిపించగా.. తాను అతణ్ని పలకరించానని చెప్పాడు.

ఇప్పటికీ గర్వంగా..
తన బ్యాట్ అచ్చి రావట్లేదని అసంతృప్తితో సమాధానమిచ్చాడని అన్నాడు. ఆ వెంటనే తన బ్యాట్ అడగ్గా.. తాను వెనుకా ముందు ఆలోచించకుండా దాన్ని రోహిత్‌కు ఇచ్చానని చెప్పాడు డీకే. కీలకమైన ఆ మ్యాచ్‌లో రోహిత్ శర్మ అద్భుతంగా రాణించాడని, 40 బంతుల్లో 50 పరుగులు చేశాడని గుర్తు చేసుకున్నాడు. రోహిత్ శర్మ తొలి అర్థసెంచరీ తన బ్యాట్ నుంచి జాలువారడాన్ని తలచుకుంటే ఇప్పటికీ గర్వంగా ఉంటుందని వ్యాఖ్యానించాడు. ఆ మ్యాచ్‌లో రోహిత్ శర్మ అద్భుతంగా ఆడాడని పేర్కొన్నాడు.


Click it and Unblock the Notifications












