Indian ODI Squad For West Indies: రోహిత్ ఫిట్.. బుమ్రాకు రెస్ట్! భువీ ఔట్.. హార్దిక్ పాండ్యా ఇన్!

ఎన్నో అంచనాల మధ్య సౌతాఫ్రికా గడ్డపై అడుగుపెట్టిన టీమిండియా.. చెత్తాటతో టెస్ట్, వన్డే సిరీస్‌ల్లో చిత్తుగా ఓడి ఇంటిముఖం పట్టింది. ఈ ఘోర పరాజయం తర్వాత సొంతగడ్డపై వెస్టిండీస్‌తో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌లో సత్తా చాటి మళ్లీ విజయాల బాట పట్టాలని భావిస్తోంది. ఫిబ్రవరి 5 నుంచి ప్రారంభం కానున్న ఈ వన్డే సిరీస్‌కు పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులోకి రానున్నాడు.

గాయం కారణంగా సౌతాఫ్రికా పర్యటనకు దూరమైన అతను పూర్తిగా కోలుకున్నాడు. వెస్టిండీస్‌తో తలపడే జట్టుకు నాయకత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నాడు. రోహిత్‌ బుధవారం జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ)లో ఫిట్‌నెస్‌ పరీక్షకు హాజరుకానున్నాడు. ఆ తర్వాతే సెలక్షన్‌ కమిటీ జట్టును ఎంపిక చేయనుంది. 18 మందిని ఎంపికచేసే ఈ టీమ్‌లో కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంది. సౌతాఫ్రికా పర్యటనలో విఫలమైన ఆటగాళ్లను పక్కనపెట్టే అవకాశం ఉంది.

భువీ, అశ్విన్ ఔట్..

భువీ, అశ్విన్ ఔట్..

సౌతాఫ్రికా పర్యటనలో దారుణంగా విఫలమైన భువనేశ్వర్ కుమార్, రవిచంద్రన్ అశ్విన్‌లను సెలెక్టర్లు పక్కనపెట్టే అవకాశం ఉంది. సఫారీలతో తొలి రెండు వన్డేల్లో భువీ ఒక్క వికెట్ తీయకపోగా ఎక్స్‌పెన్సివ్‌గా ప్రూవ్ అయ్యాడు. అంతేకాకుండా అతని బౌలింగ్‌ వేగం కూడా తగ్గింది. భువీ యార్కర్ల, హాఫ్ కట్టర్స్, స్లోయర్స్‌ను బ్యాట్స్‌మన్ ఈజీగా రీడ్ చేస్తున్నారు.

ఈ వైఫల్యంతోనే చివరి వన్డేకు అతన్ని పక్కనపెట్టి దీపక్ చాహర్‌కు అవకాశం ఇవ్వగా అతను సత్తా చాటాడు. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ మెరిసాడు. దాంతో భువీకి నిష్క్రమణ తప్పేలా లేదు. మరోవైపు సుదీర్ఘ కాలం తర్వాత వన్డే జట్టులోకి వచ్చిన అశ్విన్ సత్తా చాటలేకపోయాడు. గాయానికి చికిత్స తీసుకునే నేపథ్యంలో అతనే విండీస్‌తో సిరీస్‌కు దూరంగా ఉండాలనుకుంటున్నాడని క్రిక్‌బజ్ పేర్కొంది.

జస్‌ప్రీత్ బుమ్రాకు రెస్ట్..

జస్‌ప్రీత్ బుమ్రాకు రెస్ట్..

ఇక తీరిక లేని క్రికెట్ ఆడుతున్న జస్‌ప్రీత్ బుమ్రాకు ఈ సిరీస్ నుంచి విశ్రాంతి కల్పించే అవకాశం ఉంది. అతని స్థానంలో మహమ్మద్ షమీని జట్టులోకి తీసుకోనున్నారు. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు షమీ దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఇక షమీకి తోడుగా దీపక్ చాహర్, మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్ ఈ సిరీస్‌లో పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. స్పిన్నర్లుగా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌తో పాటు యుజ్వేంద్ర చాహల్, జయంత్ యాదవ్‌కు అవకాశం దక్కనుంది.

హార్దిక్ పాండ్యా రీఎంట్రీ..

హార్దిక్ పాండ్యా రీఎంట్రీ..

టీ20 ప్రపంచకప్‌లో పేలవ ప్రదర్శనకు తోడు... ఫిట్‌నెస్‌ సమస్యలతో జట్టుకు దూరమైన టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే నెట్స్‌లో బౌలింగ్‌ ప్రాక్టీసు చేస్తున్న అతను.. బౌలింగ్ చేయడానికి సిద్దమైతే సెలెక్టర్లు అతన్ని పరిగణలోకి తీసుకునే చాన్స్ ఉంది.

ఇక హార్దిక్‌ పాండ్యాకు ప్రత్యామ్నాయంగా భావించిన యువ ఆల్‌రౌండర్‌ వెంకటేశ్‌ అయ్యర్‌ సౌతాఫ్రికా సిరీస్‌లో పూర్తిగా తేలిపోయాడు. దాంతో మరోసారి పాండ్యాకు అవకాశం ఇవ్వాలని సెలెక్టర్లు భావిస్తున్నారు. విజయ్ హజారే ట్రోఫీలో సత్తా చాటిన హిమాచల్ ప్రదేశ్ కెప్టెన్, ఆల్‌రౌండర్ రిషిధావన్‌కు కూడా చోటు దక్కే సూచనలు కనిపిస్తున్నాయి.

ఓపెనర్లు ధావన్, రోహిత్..

ఓపెనర్లు ధావన్, రోహిత్..

ఇక బ్యాటింగ్ విభాగంలో పెద్దగా మార్పులు చోటు చేసుకోకపోవచ్చు. రోహిత్ శర్మ రీఎంట్రీతో కేఎల్ రాహుల్ మిడిలార్డర్‌లో ఆడనున్నాడు. సౌతాఫ్రికా పర్యటనలో సత్తాచాటిన శిఖర్ ధావన్‌కు చోటు దక్కడం ఖాయం. అతనికి బ్యాకప్‌గా రుతురాజ్ గైక్వాడ్‌ను తీసుకోనున్నారు. మిడిలార్డర్‌లో విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ చోటు దక్కించుకోనున్నారు. అయితే తుది జట్టులో మాత్రం అయ్యర్‌కు బుదులు సూర్యకుమార్ యాదవ్‌కే అవకాశం దక్కనుంది. సౌతాఫ్రికా పర్యటనలో విఫలమైన అయ్యర్‌ బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశాలున్నాయి.

IND VS SA: ఈ Team India కి ఏమైంది ODI Series కూడా గోవింద! | Oneindia Telugu
భారత్ వన్డే జట్టు:( అంచనా)

భారత్ వన్డే జట్టు:( అంచనా)

రోహిత్ శర్మ(కెప్టెన్), శిఖర్ ధావన్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్, హార్దిక్ పాండ్యా/ వెంకటేశ్ అయ్యర్/రిషి ధావన్, అక్షర్ పటేల్, జయంత్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, మహమ్మద్ షమీ, దీపక్ చాహర్, ప్రసిధ్ కృష్ణ, నవదీప్ సైనీ, మహమ్మద్ సిరాజ్

For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Wednesday, January 26, 2022, 12:22 [IST]
Other articles published on Jan 26, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X