Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsAUS : వైస్ కెప్టెన్ అయితే కొమ్ములుంటాయా?.. రాహుల్‌ను పక్కన పెట్టాలన్న మాజీ లెజెండ్!

Indian legend want KL Rahul to sit out for first INDvsAUS Test

ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకు టీమిండియా సిద్ధమైంది. దీంతో తొలి టెస్టులో ఆడే జట్టును అంచనా వేసే పనిలో మాజీ దిగ్గజాలు పడ్డారు. సూర్యను ఆడించాలని కొందరు అంటే.. గిల్‌ను కచ్చితంగా ఆడించాలని మరికొందరు బల్లగుద్ది మరీ చెప్తున్నారు. ఈ క్రమంలో టీమిండియా మాజీ లెజెండ్ హర్భజన్ సింగ్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. సూపర్ ఫామ్‌లో ఉన్న గిల్‌ను ఇప్పుడు ఆడించకుంటే.. ఇక ఎప్పుడు ఆడిస్తారని ప్రశ్నించాడు.

రాహుల్ చెత్త ఫామ్

రాహుల్ చెత్త ఫామ్

ప్రస్తుతం టీమిండియా వైస్ కెప్టెన్‌గా ఉన్న కేఎల్ రాహుల్ అంత గొప్ప ఫామ్‌లో లేడు. గతేడాది సౌతాఫ్రికాతో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో సెంచరీ చేసిన అతను.. ఆ తర్వాత మ్యాచుల్లో చేతులెత్తేశాడు. ఆ తర్వాత పెద్దగా టెస్టులు ఆడని అతను.. చివరగా బంగ్లాదేశ్‌పై అత్యంత పేలవమైన ఫామ్ కనబరిచాడు. ఆ జట్టుతో జరిగిన రెండు టెస్టు మ్యాచుల్లో ఓపెనర్‌గా వచ్చిన రాహుల్.. మొత్తమ్మీద 57 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

ఇక ఎప్పుడు ఆడిస్తారు?

ఇక ఎప్పుడు ఆడిస్తారు?

కేఎల్ రాహుల్ దారుణంగా విఫలమైన అదే బంగ్లాదేశ్ సిరీస్‌లో శుభ్‌మన్ గిల్ తన తొలి టెస్టు సెంచరీ సాధించాడు. ఆ తర్వాత జరిగిన వన్డేల్లో కూడా రాణించాడు. తాజాగా కివీస్‌పై తొలి వన్డే డబుల్ సెంచరీతో చెలరేగాడు. చివరగా న్యూజిల్యాండ్‌పైనే టీ20లో కూడా సెంచరీ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇంత గొప్ప ఫామ్‌లో ఉన్న గిల్‌ను ఇప్పుడు ఆడించకపోతే ఇక ఎప్పుడు ఆడిస్తారని హర్భజన్ సింగ్ ప్రశ్నించాడు. రాహుల్ గొప్ప ఆటగాడే కానీ.. ప్రస్తుతం ఉన్న ఫామ్‌లో ఓపెనర్‌గా గిల్‌నే పంపాలని తేల్చేశాడు.

రహానే కూడా వైస్ కెప్టెనే!

రహానే కూడా వైస్ కెప్టెనే!

సరే గిల్‌ను ఓపెనర్‌గా పంపి, రాహుల్‌ను మిడిలార్డర్‌లో ఆడిద్దాం అన్నా కూడా భజ్జీ ఒప్పుకోలేదు. ఆ స్థానంలో సూర్యకుమార్‌ను ఆడించాలని సూచించాడు. ఫస్ట్ క్లాస్‌లో సూర్య మిడిలార్డర్‌లో ఆడతాడని, అతన్ని అదే స్థానంలో ఆడించాలని చెప్పాడు. స్పిన్‌ను చక్కగా ఎదుర్కొనే బ్యాటర్ అని, కాబట్టి సూర్యకు కచ్చితంగా అవకాశం కల్పించాలని భజ్జీ అన్నాడు. ఈ నేపథ్యంలో రాహుల్‌ను పక్కన పెట్టడమే కరెక్ట్ అని తేల్చేశాడు. అదేంటి? అతను వైస్ కెప్టెన్ కదా అంటే.. 2018లో సఫారీ టూర్‌లో రహానే కూడా వైస్ కెప్టెనే అని, అయినా అతన్ని పక్కన పెట్టారని గుర్తు చేశాడు. వ్యక్తుల కన్నా జట్టే ముఖ్యం అనుకోవాలని చెప్పాడు. మరి టీమిండియా ఏం చేస్తుందో చూడాలి.

Story first published: Wednesday, February 8, 2023, 15:17 [IST]
Other articles published on Feb 8, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+