For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రాహుల్ రికార్డుల మోత: కోహ్లీని బోల్తా కొట్టించారు

By Pratap

కింగ్‌స్టన్: వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచులో భారత్ బ్యాటింగ్‌లో అదరగొడుతోంది. ఈ మ్యాచ్‌లో లోకేష్ రాహుల్ 158 పరుగులు చేశాడు. మురళీ విజయ్‌ గాయం కారణంగా దూరం కావడంతో జట్టులోకి వచ్చిన రాహుల్ తనకు లభించిన అవకాశాన్ని అద్భుతంగా వాడుకున్నాడు. 303 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్స్‌లు, 52.15 స్ట్రైక్ రేట్‌తో 158 పరుగులు చేశాడు.

రాహుల్ ఈ క్రమంలో పలు రికార్డులు నెలకొల్పాడు. వెస్టిండీస్‌తో ఆడిన మొదటి మ్యాచ్‌లోనే సెంచరీ చేసిన తొలి భారత ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా రాహుల్ రికార్డు సృష్టించాడు. ఓ భారత బ్యాట్స్‌మెన్‌గా వెస్టిండీస్‌లో ఓపెనింగ్‌కు దిగి తొలి మ్యాచ్‌లోనే సెంచరీ చేసిన ఆటగాళ్లు లోకేశ్ రాహుల్‌కు ముందు మరొకరు లేరు.

Rahul KL

అంతకుముందు 1997లో అజయ్ జడేజా విండీస్‌లో ఓపెనింగ్‌ బ్యాట్స్‌మెన్‌గా దిగి తాను ఆడిన తొలి మ్యాచ్‌లో చేసిన 96 పరుగులే ఇప్పటివరకూ అత్యధిక వ్యక్తిగత పరుగులు. అయితే ఓపెనర్‌గా బ్యాటింగ్‌కు దిగకపోయినప్పటికీ వెస్టిండీస్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లో సెంచరీలు నమోదు చేసిన భారత ఆటగాళ్లు ఐదుగురు ఉన్నారు. వారిలోనూ రాహుల్ చేసిన 158 పరుగులే అత్యధికం.

ఆ ఐదుగురు భారత ఆటగాళ్లు..

1) లోకేష్ రాహుల్ 158 పరుగులు - 2016
2) పాలి ఉమ్రిగర్ 130 - 1953
3) బ్రిజేష్ పటేల్ 115 - 1976
4) అశ్విన్ 113 - 2016
5) సంజయ్ మంజ్రేకర్ 108 - 1989

కోహ్లీని బోల్తా కొట్టించాం...

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ వికెట్‌ను తాము అనుకున్న ప్రకారమే పడగొట్టామని విండీస్ కోచ్ పిల్ సిమ్మన్స్ అన్నారు. విండీస్ బౌలర్లను ఆయన ప్రశంసలతో ముంచెత్తారు. రెండో టెస్ట్ మ్యాచ్ రెండో రోజు ఆటలో తమ బౌలర్లు పథకం ప్రకారమే భారత ఆటగాళ్లను తొందరగా పెవిలియన్‌కు పంపగలిగారని చెప్పారు.

దాంతో ఎక్కువ పరుగులు చేయనీయకుండా కోహ్లీని కట్టడిచేశామని అన్నారు. కోహ్లీ వికెట్‌తో తమ ఆత్మ విశ్వాసం పెరిగిందని, దీంతో మిగిలిన వికెట్లను తమ బౌలర్లు తొందరగా పడగొడతారని చెప్పారు. అయితే అందుకు సహకారంగా తమ బ్యాట్స్‌మెన్‌ను పుంజుకోవాల్సిందిగా కోరినట్టు ఆయన చెప్పారు.

కానీ ఒక్క లోకేశ్ రాహుల్ మాత్రం 158 పరుగులతో మెచ్చుకోతగిన ఇన్నింగ్స్ ఆడాడని కొనియాడారు. తమ బౌలర్లు కూడా టైట్ లైన్ అండ్ లెంగ్త్ బౌలింగ్‌తో ఆకట్టుకున్నారని సిమ్మన్స్ చెప్పారు. విరాట్ కోహ్లీ 44 పరుగులు చేసి అవుటయ్యాడు

భారత్, విండీస్‌ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో అజింక్యా రహనే కూడా ధాటిగా ఆడాడు. అర్థ సెంచరీతో మెరిశాడు. 96 బంతులు ఎదుర్కొని 8 ఫోర్లు, ఒక సిక్స్‌తో 50 పరుగులు చేశాడు. టీమిండియా విండీస్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచే అవకాశముంది.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+