
హైదరాబాద్: ఐదు టెస్టుల యాషెస్ సిరిస్‌లో తొలి రెండు టెస్టులు (బ్రిస్బేన్, అడిలైడ్)లు ప్రశాంతంగా ముగిశాయి. మూడో టెస్టు పెర్త్ వేదికగా గురువారం ప్రారంభమైంది. మూడో టెస్టుకు ముందు ఒక్కసారిగా ఫిక్సింగ్ ఆరోపణలు రావడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఆందోళనకు గురయ్యారు.
ది సన్ పత్రికకు చెందిన అండర్ కవర్ రిపోర్టర్లు ఈ ఫిక్సింగ్ భూతాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. ఈ ఫిక్సింగ్‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందులో ఆటగాళ్లు యాషెస్ టెస్టు సిరిస్‌తో పాటు బిగ్ బాష్ 20/20లీగ్‌ను ఫిక్స్ చేసేందుకు ఆసీస్‌కు చెందిన క్రికెటర్లు సిద్ధంగా ఉన్నారని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు సోబర్స్ జోబాన్ అన్నాడు.
ఫిక్సింగ్‌లో భాగంగా యాషెస్ టెస్టు సిరిస్‌ను క్రికెటర్లు సెషన్ల పరంగా ఫిక్స్ చేస్తారని సోబర్స్ జోబాన్ వివరించడం విశేషం. మ్యాచ్ గెలుపుఓటములతో ఆటగాళ్లకు సంబంధం ఉండదని... ఫిక్సింగ్ చేసినందుకు ఇంత మొత్తం చెల్లించాలని అతడు భారత్‌కు చెందిన ఓ బుకీతో మాట్లాడటాన్ని ది సన్ పత్రిక రిపోర్టర్లు రికార్డు చేశారు.
మ్యాచ్‌కి ముందుగానే ఏ ఓవర్‌లో ఫిక్స్ అవుతుందో ఆ ఓవర్‌లో ఎన్ని పరుగులు వస్తాయో భారత్‌కు చెందిన బుకీకి ఆటగాళ్ల సిగ్నల్స్ ద్వారా వెల్లడిస్తానని సోబర్స్ జోబాన్ పేర్కొనడం విశేషం. అయితే ఈ ఫిక్సింగ్ యాషెస్ సిరిస్‌తో పాటు బిగ్ బాష్ లీగ్‌కే పరిమితం కాలేదు.
వచ్చే ఏడాది భారత్‌లో జరగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టోర్నీపై కూడా కన్నేశారు. 2018లో జరగనున్న ఐపీఎల్‌లో ఫిక్సింగ్‌కు పాల్పడేందుకు ఇప్పటి నుంచే భారత్‌కు చెందిన బుకీలు సన్నాహాకాలను ప్రారంభించినట్లు తెలుస్తోంది.
యాషెస్ టెస్టు సిరిస్‌తో పాటు బిగ్ బాష్ లీగ్‌ను ఫిక్సింగ్ చేసేందుకు ప్రయత్నించిన ఇద్దరిలో ఒకరిని సోబర్స్ జోబాన్‌గా గుర్తించగా, మరికొరు భారత్‌కు చెందిన ప్రియాంక సక్సేనా గుర్తించారు.
ఫిక్సర్ 1: సోబర్స్ జోబాన్
ది సన్ పత్రికలో వచ్చిన కథనం ప్రకారం సోబర్స్ జోబాన్ మాజీ రాష్ట్ర స్థాయి ఆటగాడు. వయసు 31. ప్రస్తుతం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో గతంలో ఢిల్లీ జట్టులో కలిసి ఆడాడు. ఢిల్లీలోని వసంత్ విహార్‌లో సోబర్స్ జోబాన్ ఇల్లు కూడా ఉంది. సోబర్స్ జోబాన్ సోషల్ మీడియా ప్రోఫైల్ చూస్తే హాలిడేస్‌లో ప్రపంచాన్ని చుట్టి వచ్చేలా కనిపిస్తున్నాడు.
ఫిక్సర్ 2: ప్రియాంక సక్సేనా
సోబర్స్ జోబాన్ పాట్నర్. దక్షిణాఫ్రికాలో బిజినెస్ కార్యకలాపాలను నిర్వహిస్తూ ఉంటాడు. అవినీతి క్రికెటర్లను ఎక్కువగా కలుస్తుంటాడు. వారితో ఫిక్సింగ్ ఎలా చేయాలో తదితర విషయాలపై చర్చిస్తుంటాడు. మరోవైపు పెర్త్ టెస్టు ఫిక్సింగ్‌కు గురైనట్లు వచ్చిన ఆరోపణలపై ఐసీసీ యాంటీ కరప్షన్ జనరల్ మేనేజర్ అలెక్స్ మార్షల్ స్పందించారు.
'ది సన్ పత్రిక విచారణలో వెల్లడైన అన్ని విషయాలను మా వద్ద ఉన్నాయి. యాషెస్ టెస్టు సిరిస్‌పై వచ్చిన ఫిక్సింగ్ ఆరోపణలను చాలా సీరియస్‌గా తీసుకుంది. దీనిపై ఐసీసీ యాంటీ కరప్షన్ యూనిట్ పని చేస్తోంది' అని ఆయన తెలిపారు. ఆయితే తన ప్రాథమిక దర్యాప్తులో ఫిక్సింగ్‌కు సంబంధించిన ఆధారాలు ఏమీ లభించలేదని ఆయన తెలిపారు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.