Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WTC final Day 1: కొత్త సామెత: వరుణుడిపై కోపం ఐసీసీ మీద: టెస్ట్ కాస్తా వన్డేగా

 Indian Fans Trolls ICC For Conducting WTC Final In England

లండన్: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ (WTC Final) తొలి రోజు ఆట వర్షార్పణం కావడానికే అధికావకాశాలు ఉన్నాయి. బ్రిటన్ కాలమానం ప్రకారం.. గురువారం సాయంత్రం ఆరంభమైన వర్షం.. రాత్రి కూడా కొనసాగుతోంది. మధ్యలో కొంత విరామం ఇచ్చినప్పటికీ- మళ్లీ మొదలైంది. మ్యాచ్ ప్రారంభం అయ్యే సమయానికి కొంత తెరపి ఇవ్వొచ్చని బ్రిటన్ వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. కొంత విరామం ఇస్తూ.. శుక్రవారం మొత్తం సౌథాంప్టన్‌లో వర్షం కురుస్తుందని అంచనా వేశారు. అది మ్యాచ్ కొనసాగించడానికి వీలు కల్పించే స్థాయిలో ఉండకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.

వరుణ దేవుడి మీద ఉన్న కోపాన్ని ఐసీసీ మీద

ఈ పరిణామాల కాస్తా భారత క్రికెట్ ప్రేమికులను ఆగ్రహావేశాలకు గురి చేస్తోన్నాయి. అత్త మీద కోపం.. దుత్త మీద చూపించినట్టు తయారైంది వారి పరిస్థితి. వరుణ దేవుడి మీద ఉన్న కోపాన్ని ఐసీసీ మీద ప్రదర్శించేస్తోన్నారు. రెండేళ్లుగా ఎదురు చూస్తోన్న డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌ను వర్షాకాలంలో షెడ్యూల్ చేసినందుకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ మీద భగ్గుమంటోన్నారు. ట్రోల్స్‌తో విరుచుకుపడుతున్నారు. తమ ఆగ్రహానికి కామెడీని జోడించి.. ట్వీట్లు చేస్తోన్నారు. వాటికి మెమెల రూపాన్ని ఇస్తోన్నారు. ఐసీసీకి ముందు చూపు లోపించిందంటూ కామెంట్స్ చేస్తోన్నారు.

టెస్ట్ కాస్తా.. వన్డేగా..

వర్షాకాలం వస్తోందనే విషయం ఐసీసీకి తెలియదా? అంటూ ప్రశ్నిస్తోన్నారు. టెస్ట్ ఛాంపియన్ టీమ్‌కు అందజేసే గదకు గొడుగును వేసి మరీ ట్వీట్లు చేస్తోన్నారు. క్రికెట్ ప్రేమికుల రెండేళ్ల నిరీక్షణకు వరుణ దేవుడు గండి కొట్టినట్టే. ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూసిన ఉత్కంఠభరిత క్షణాలు నీటిపాలయ్యాయని, దానికి ప్రధాన కారణం ఐసీసీనేనంటోన్నారు. వర్షం వల్ల అయిదు రోజులపాటు సాగాల్సిన మ్యాచ్ వన్డే ఇంటర్నేషనల్‌గా మార్చి వేసిందంటూ సెటైర్లు సంధిస్తోన్నారు.

మ్యాచ్‌కు అనుకూలించని గ్రౌండ్

సౌథాంప్టన్‌లో ప్రస్తుతం సుమారు అయిదు గంటలుగా వర్షం కురుస్తూనే ఉంది. అప్పుడప్పుడు తెరపి ఇస్తోన్నప్పటికీ.. మేఘాలు పూర్తిగా తొలగిపోలేదు. గంటకు పైగా ఏకధాటిగా కురిసిన వర్షం వల్ల ఏజెస్ బౌల్ స్టేడియం మొత్తం చిత్తడిగా మారింది. బురదమయమైంది. పిచ్‌ డ్యామేజ్ కాకుండా గ్రౌండ్ స్టాఫ్ దాన్ని కప్పి ఉంచారు. అవుట్ ఫీల్డ్‌లో వర్షపు నీళ్లు నిలిచాయి. వర్షం పూర్తిగా తొలగిపోతే గానీ.. దాన్ని ఆరబెట్టే చర్యలను తీసుకోలేకపోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితి ఇంకొన్ని గంటలు కొనసాగితే మాత్రం తొలి రోజు ఆట తుడిచిపెట్టుకుపోయినట్టే.

Story first published: Friday, June 18, 2021, 11:21 [IST]
Other articles published on Jun 18, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+