
యువ ప్రతిభను గుర్తించడంలో టీమిండియా మాజీ క్రికెటర్, కోచ్ రవిశాస్త్రి నేర్పుకలవాడు. యువ పేసర్లను గుర్తించడంలో రవిశాస్త్రి అంచనా సరిగా ఉంటుంది. ఎందుకంటే, అతను భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా ఉన్న సమయంలో జస్ప్రీత్ బుమ్రాను టెస్ట్ జట్టులోకి లాక్కొచ్చాడు. కోచ్‌గా రవిశాస్త్రి, కెప్టెన్‌గా కోహ్లీ ఉన్న టైంలోనే టీమిండియా ప్రపంచంలోనే అత్యుత్తమమైన పేస్ దళం ఏర్పడింది. రవిశాస్త్రి ప్రస్తుతం భారత కోచ్‌గా తన పాత్ర నుంచి తప్పుకున్నప్పటికీ.. యువ ప్రతిభావంతులను ఆయన అన్వేషిస్తూనే ఉంటాడు. ఈ క్రమంలో అతి త్వరలోనే జాతీయ జట్టులోకి ప్రవేశించగల ఒక యువ ప్రతిభావంతుడిని రవిశాస్త్రతి గుర్తించాడు. 2019లో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన అర్ష్‌దీప్ సింగ్.. పంజాబ్ కింగ్స్ తరఫున వరుసగా నాలుగు సీజన్లు ఆడుతున్నాడు. మెగా వేలానికి ముందు పంజాబ్ ఫ్రాంచైజీ రిటైన్ చేసిన ఇద్దరు ఆటగాళ్లలో అతను ఒకడు. ఈ లెఫ్టార్మ్ పేసర్ ఇప్పటివరకు కొనసాగించిన తన బౌలింగ్ పటిమను మరికొన్ని రోజులు కొనసాగిస్తే.. అతను అతి త్వరలోనే టీమిండియా జెర్సీ ధరించడం ఖాయమని రవిశాస్త్రి తెలిపాడు.
స్టార్ స్పోర్ట్స్‌తో రవిశాస్త్రి మాట్లాడుతూ.. '23ఏళ్ల అర్షదీప్ కొత్త బంతితో తన ఆటను బాగా మెరుగుపరుచుకున్నాడు. ఈ ఐపీఎల్ సీజన్‌లో అత్యుత్తమ డెత్ బౌలర్లలో అర్షదీప్ ఒకడు. చాలా చిన్న వయస్సులోనే.. మ్యాచ్ సిచ్యువేషన్ సీరియస్‌గా ఉన్న టైంలో, బాగా ఒత్తిడి నెలకొన్నప్పుడు అర్షదీప్ ఎంతో ప్రశాంతంగా, పొదుపుగా బౌలింగ్ చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. అతను డెత్ ఓవర్‌లలో బాగా రాణిస్తున్నాడు. తన ఆటతీరును ఎంతో ఇంప్రూవ్ చేసుకున్నాడు. అతను త్వరలోనే భారత జట్టులోకి అడుగుపెట్టగలడు' అని శాస్త్రి పేర్కొన్నాడు. ఇక ఐపీఎల్లో ఆకట్టుకుంటున్న యంగ్ ప్లేయర్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడుతున్న పేసర్ ఉమ్రాన్ మాలిక్, ముంబై ఇండియన్స్ బ్యాటర్ తిలక్ వర్మ ఉన్నారని చెప్పాడు.

చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డెత్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేసిన అర్షదీప్.. 12బంతుల్లో కేవలం 14పరుగులే ఇచ్చి చెన్నై బ్యాటర్లను ఒత్తిడికి గురి చేసి వికెట్లు కోల్పోయేలా చేశాడు. ఫలితంగా ఆ మ్యాచ్‌లో పంజాబ్ చెన్నైపై 11పరుగులు తేడాతో గెలుపొందింది. డెత్ ఓవర్లలో బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగుతుంటారు. అలాంటిది ఈ సీజన్లో అర్షదీప్ డెత్ ఓవర్లలో బౌలింగ్ చేస్తున్నప్పుడు ఒక్క సిక్సర్ కూడా ఇవ్వలేదు. డెత్ ఓవర్లలో తక్కువ సిక్సులు ఇచ్చిన జాబితాలో అర్షదీప్ (0) తొలిస్థానంలో ఉండగా.. సునీల్ నరైన్ 1, బుమ్రా 1, షమీ 1 సిక్సర్లతో అతని తర్వాత ఉండడం గమనార్హం.