For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఎంపీగా కొత్త కెరీర్: గౌతమ్ గంభీర్ విజయంపై ఎవరేమన్నారు?

Indian cricketing fraternity lauds Gautam Gambhir after his victory in the General Elections

హైదరాబాద్: టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఎంపీగా కొత్త కెరీర్‌ను మొదలుపెట్టనున్నాడు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో తూర్పు ఢిల్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన గంభీర్ తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి అర్విందర్ సింగ్ లవ్లీపై మూడు లక్షల తొంభై వేల పైచిలుకు మెజారిటీతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం

ఈ క్రమంలో గంభీర్‌కు 6,95,109 ఓట్లు రాగా అర్విందర్ సింగ్‌కు 3,04,718 ఓట్లు వచ్చాయి. ఇక, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఆతిశీ మెర్లీన్ 2,19,156 ఓట్లతో మూడో స్థానంతో సరిపెట్టుకుంది. విజయం అనంతరం గంభీర్ తన ట్విట్టర్‌లో "ఇది లవ్లీకవర్ డ్రైవో.. లేక ఆతిశీపై అద్భుత బ్యాటింగో కాదు. ప్రజలు ఆమోదించిన గంభీర భావజాలం. అద్భుత తీర్పునిచ్చిన ప్రజల ఎంపికను విఫలం కానివ్వం" అని ట్వీట్ చేశాడు.

కాగా, పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన గౌతమ్ గంభీర్‌కు మాజీ క్రికెటర్లు వీవీఎస్ లక్ష్మణ్, హర్భజన్ సింగ్, రైనా, ఉన్ముక్త్ చంద్, ఆర్పీ సింగ్, శిఖర్ ధావన్‌లు శుభాకాంక్షలు తెలిపారు.

Story first published: Friday, May 24, 2019, 17:00 [IST]
Other articles published on May 24, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+