న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Cricket Flashback 2016: పెళ్లి బాజాలు మోగిన క్రికెటర్లు

ఈ ఏడాది టీమిండియా క్రికెటర్లు ఎవరెవరు తమ బ్యాచిలర్ లైఫ్‌కు స్వస్తి పలికి కొత్త ఇన్నింగ్స్‌ను ప్రారంభించారో చూద్దాం.

By Nageshwara Rao

హైదరాబాద్: ఈ ఏడాది టీమిండియా అనేక విజయాలను సాధించింది. ముఖ్యంగా 2016లో కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా దూసుకుపోతుంది. వరుసగా ఐదు టెస్టు సిరిస్ విజయాలను సొంతం చేసుకుని టెస్టు ర్యాంకుల్లో నెంబర్ వన్ ర్యాంకుని సొంతం చేసుకుంది.

మరికొద్ది రోజుల్లో కొత్త సంవత్సరం రానుంది. ఈ క్రమంలో టీమిండియా క్రికెటర్లు ఎవరెవరు తమ బ్యాచిలర్ లైఫ్‌కు స్వస్తి పలికి కొత్త ఇన్నింగ్స్‌ను ప్రారంభించారో చూద్దాం. ఈ ఏడాదిలో ముందుగా ఫిబ్రవరి నెలలో టీమిండియా బౌలర్ వరున్ ఆరోన్ ఓ ఇంటివాడయ్యాడు.

ఆ తర్వాత మార్చిలో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ సురేశ్ రైనా కొత్త ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. ఇలా ఒక్కొక్కరు కొత్త ఇన్నింగ్స్‌కు శ్రీకారం చుట్టారు. కాగా, ఈ ఏడాది చివరలో టీమిండియా ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్, బాలీవుడ్ నటి, మోడల్ హాజెల్ కీచ్‌ను వివాహం చేసుకున్నాడు.

ఇలా ఈ ఏడాది మన భారత క్రికెటర్లు తమ బ్యాచిలర్ లైఫ్‌కి స్వస్తి పలికి పెళ్లి పీటలెక్కారో ఓ లుక్కేందాం:

ఫిబ్రవరిలో ఓ ఇంటివాడైన భారత క్రికెటర్ వరుణ్ ఆరోన్

ఫిబ్రవరిలో ఓ ఇంటివాడైన భారత క్రికెటర్ వరుణ్ ఆరోన్

ఈ ఏడాది మొదట్లో భారత క్రికెటర్ వరుణ్ ఆరోన్ జంషెడ్‌పూర్‌ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో తన చిన్ననాటి స్నేహితురాలు రాగిణిని వివాహం చేసుకున్నాడు. వీరి పెళ్లి అనంతరం స్వీట్లు తినిపించుకున్నారు.

ప్రియాంక-సురేశ్ రైనా

ప్రియాంక-సురేశ్ రైనా

ఈ ఏడాది ఏప్రిల్‌లో సురేశ్ రైనా ఓ ఇంటివాడయ్యాడు. తన చిన్ననాటి స్నేహితురాలు ప్రియాంక వివాహం చేసుకున్నాడు. స్థానిక స్టార్ హోటల్లో జరిగిన ఈ పెళ్లి వేడుకకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, పలువురు క్రికెటర్లు, సినీ ప్రముఖులు హాజరయ్యారు. రైనా-ప్రియాంకల పెళ్లి వేడుకకు ధోని తన భార్య సాక్షి సింగ్‌తో హాజరుకాగా, ఆనాటి ఐసీసీ ఛైర్మన్ శ్రీనివాసన్‌తో పాటు చెన్నై సూపర్ కింగ్స్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్, మైక్ హస్సీ, మోహిత్ శర్మ, సెహ్వాగ్, డ్వేన్ బ్రేవో, స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్‌తో సహ పలువురు రాజకీయ నాయకులు కూడా వేడుకల్లో పాల్గొన్నారు. ఈ వేడుకలో యంగ్ లవర్స్ విరాట్ కోహ్లి, అనుష్క శర్మ శర్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

స్క్వాష్ ప్లేయర్ దీపికా పల్లికల్‌-క్రికెటర్ దినేశ్ కార్తిక్

స్క్వాష్ ప్లేయర్ దీపికా పల్లికల్‌-క్రికెటర్ దినేశ్ కార్తిక్

ఈ ఏడాది క్రికెటర్ దినేశ్ కార్తిక్, స్క్వాష్ ప్లేయర్ దీపికా పల్లికల్‌ల పెళ్లాడు. ఈ వివహానికి ఒ ప్రత్యేకత ఉంది. తొలుత క్రైస్తవ, ఆ తర్వాత హిందూ సంప్రదాయాల ప్రకారం చెన్నైలోని ఓ హోటల్‌లో వీరి వివాహం జరగింది. ఆగస్టు 18న తొలుత క్రైస్తవ సంప్రదాయంలో, 20న తెలుగు నాయుడు సంప్రదాయరీతిలో దీపిక-దినేష్‌ల వివాహం జరుగుతుంది. దీపికా పల్లికల్ క్రిస్టియన్ కుటుంబానికి చెందినది కాగా, దినేశ్ కార్తీక్‌ పూర్వీకులు ఆంధ్రప్రదేశ్‌ నుంచి వెళ్లి చెన్నైలో స్థిరపడిన తెలుగు కుటుంబానికి చెందిన వాడు. దీంతో ఇరు కుటుంబాల కోరిక మేరకు రెండు మతాల సంప్రదాయాల ప్రకారం వీరి విహవాం జరగింది.

ధవళ్ కులకర్ణి-శ్రద్ధా కార్పుడే

ధవళ్ కులకర్ణి-శ్రద్ధా కార్పుడే

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్‌కు చెందిన పేసర్ ధవళ్ కులకర్ణి, నాలుగేళ్లుగా ప్రేమాయణం సాగిస్తున్న ఫ్యాషన్ కో-ఆర్డినేటర్ శ్రద్ధా కార్పుడేను వివాహం చేసుకున్నాడు. వధూవరుల కుటుంబాలకు చెందిన సన్నిహితులు, స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. వీరి వివాహ కార్యక్రమం మరాఠీ సంప్రదాయ పద్ధతిలో జరిగింది.

రాబిన్ ఊతప్ప-శీతల్ గౌతమ్‌

రాబిన్ ఊతప్ప-శీతల్ గౌతమ్‌

భారత జట్టులో కీలక బ్యాట్స్ మన్‌గా కొనసాగిన రాబిన్ ఊతప్ప టెన్నిస్ క్రీడాకారిణిగా క్రీడా ప్రపంచంలో బాగానే ప్రాచుర్యం పొందిన షీతల్ గౌతమ్ వివాహం చేసుకున్నాడు. బెంగళూరులో క్రిస్టియన్ సంప్రదాయ పద్ధతి ప్రకారం జరిగిన కార్యక్రమంలో టెన్నిస్ క్రీడాకారిణి శీతల్ గౌతమ్‌తో ఊతప్ప పెళ్లి ప్రమాణాలు చేశాడు. ఈ వివాహ వేడుకకు ఊతప్ప సహచర క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ తో పాటు బాలీవుడ్ నటి జుహి చావ్లా హాజరయ్యారు.

బాలీవుడ్ నటి గీతా బస్రా-హార్భజన్ సింగ్

బాలీవుడ్ నటి గీతా బస్రా-హార్భజన్ సింగ్

టీమిండియా స్పిన్నర్ హార్భజన్ సింగ్ తన గర్ల్ ఫ్రెండ్, బాలీవుడ్ నటి గీతా బస్రాను అక్టోబర్ 29న వివహం చేసుకున్నాడు. వీరిద్దిరి పెళ్లి అక్టోబర్ 29న జలంధర్‌లో జరిగింది. బాలీవుడ్ నటి అయిన గీతా బస్రాతో గత కొన్ని సంవత్సరాల నుంచి హర్భజన్ ప్రేమాయణం నడిపిన సంగతి తెలిసిందే. నవంబర్ 1న ఢిల్లీలో హోటల్‌లో గ్రాండ్ రిసెప్షన్‌ కూడా ఇచ్చారు.

మోహిత్ శర్మ-శ్వేత

మోహిత్ శర్మ-శ్వేత

టీమిండియా క్రికెటర్ మోహిత్ శర్మ తన ప్రేయసి శ్వేతను ఈ ఏడాది మార్చిలో వివాహమాడాడు. కోల్‌కత్తాకు చెందిన 27 ఏళ్ల శ్వేత హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చదువుతోంది. వీరి వివాహానికి వీరేంద్ర సెహ్వాగ్, పర్వీందర్ ఆవానా, ఉన్ముక్త్ చంద్, జోగిందర్ శర్మ తదితరులు హాజరయ్యారు.

యువరాజ్ సింగ్-హాజెల్ కీచ్

యువరాజ్ సింగ్-హాజెల్ కీచ్

టీమిండియా ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్, బాలీవుడ్ నటి హాజెల్ కీచ్‌ల వివాహం అంగరంగ వైభవంగా ముగిసిన సంగతి తెలిసిందే. నవంబర్ 30వ తేదీన సిక్కు సంప్రదాయ ప్రకారం చండీగఢ్‌కు 40 కిలోమీటర్ల దూరంలో ఫతేగఢ్ సాహిబ్ గ్రామం వద్ద ఉన్న ధార్మిక కేంద్రం 'బాబా రాందేవ్ సింగ్ డేరా'లో అంగరంగ వైభవంగా జరగ్గా డిసెంబర్ 2(శుక్రవారం)న గోవాలో హిందూ సంప్రదాయం ప్రకారం మళ్లీ వివాహం చేసుకున్నారు. యువీ, హాజెల్ కీచ్‌లు తమ పెళ్లి వేడుకలను సుమారు 10 రోజులు నిర్వహించేలా ముందుగానే ఓ ప్రణాళిక వేసుకున్నారు. ఇందులో భాగంగా పెళ్లికి ముందు ఛండీగడ్‌లో సంగీత్, మెహందీ ఫంక్షన్‌లను నిర్వహించారు.

మంగళవారం సంగీత్‌ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి క్రికెట్ లెజెండ్ సచిన్‌ టెండూల్కర్, హర్భజన్‌సింగ్‌, జహీర్‌ ఖాన్‌, శిఖర్‌ ధావన్‌‌లతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ విషయాన్ని యువీ తన ఫేస్‌బుక్‌‌లో పోస్టు చేసి అభిమానులకు తెలియజేశాడు. హర్భజన్‌ సింగ్, జహీర్‌ ఖాన్, శిఖర్ ధావన్‌తో కొత్త పెళ్లికొడుకు యువరాజ్ సింగ్ కలిసి డ్యాన్స్‌ చేస్తూ ఎంతో ఆనందంగా గడిపాడు.

ఇషాంత్ శర్మ-ప్రతిమా సింగ్

ఇషాంత్ శర్మ-ప్రతిమా సింగ్

టీమిండియా క్రికెటర్ ఇషాంత్ శర్మ ఇంటివాడయ్యాడు. బాస్కెట్ బాల్ ప్లేయర్ ప్రతిమా సింగ్‌తో ఇషాంత్ శర్మ వివాహం గుర్గావ్‌కు సమీపంలోని ఓ ఫామ్ హౌస్‌లో శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. జూన్ 19వ తేదీన న్యూఢిల్లీలో వీరిద్దరికి ఎంగేజ్‌మెంట్ అట్టహాసంగా జరిగింది. ఆ తర్వాత డిసెంబర్ 9న గుర్గావ్‌కు సమీపంలోని నాటింగ్హమ్ హిల్స్‌ ఫామ్ హౌస్‌లో వీరిద్దరూ మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఈ పెళ్లి వేడుకకు పలువురు రాజకీయ నాయకులతో పాటు టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, యువరాజ్ సింగ్‌లు హాజరయ్యారు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X