
ఏకైక భారత ఆటగాడు:
పాకిస్తాన్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్, శ్రీలంక, ఆస్ట్రేలియాకు చెందిన దిగ్గజ బౌలర్లను ఎదుర్కొన్న యశ్‌పాల్ శర్మ ఒక్కసారి కూడా సున్నా పరుగులకు వెనుదిరగలేదు. ఈ అరుదైన ఘనత సాధించిన ఏకైక భారత ఆటగాడు కేవలం యశ్‌పాల్ కావడం మరో విశేషం. డకౌట్ కాకుండా కనీసం 40కిపైగా వన్డే మ్యాచ్‌లు ఆడి కెరీర్‌ను ముగించిన క్రికెటర్లు వన్డే క్రికెట్ చరిత్రలో ఎనిమిది మంది మాత్రమే ఉన్నారు. దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు కెప్లెర్ వెసెల్స్ 109 మ్యాచ్‌ల్లో ఒక్క డకౌట్ కూడా లేకుండా కెరీర్ ముంచాడు. అన్ని మ్యాచులు ఆడి ఒక్కసారి కూడా డకౌట్ కాకపోవడం విశేషం.

యశ్‌పాల్6:
కెప్లెర్ వెసెల్స్ తర్వాతి స్థానంలో స్కాట్లాండ్ ప్లేయర్ మాథ్యూ స్కాట్ (54), ఆస్ట్రేలియా ఆటగాడు నాథన్ హౌరిట్జ్ (58 మ్యాచ్‌లు), పాకిస్తాన్ ఆటగాడు వసీం బారి (51), దక్షిణాఫ్రికాకు చెందిన జాక్ రుడాల్ఫ్ (45)లు ఉన్నారు. యశ్‌పాల్ శర్మ (42) తర్వాత దక్షిణాఫ్రికా ప్లేయర్ క్రిస్ మోరిస్ (42), శ్రీలంక ప్లేయర్ డి డిసిల్వా (41), దక్షిణాఫ్రికా ఆటగాడు పీటర్ కిర్‌స్టెన్ (40), ఇంగ్లండ్ ప్లేయర్ రసెల్ (40) వరుసగా ఈ జాబితాలో ఉన్నారు. డకౌట్ కాకుండా కెరీర్‌ను ముగించిన భారత ఆటగాళ్లలో యశ్‌పాల్ శర్మనే ఉన్నారు. ఈ రోజు ఉదయం గుండెపోటు రావడంతో యశ్‌పాల్ ఇంట్లోనే తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే.
37 టెస్టులు, 42 వన్డేలు:
1978లో పాకిస్తాన్‌తో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన యశ్‌పాల్ శర్మ.. 1983 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడు. ఇంగ్లండ్‌తో జరిగిన సెమీ ఫైనల్లో 61 పరగులు చేసి జట్టును ఫైనల్స్‌కు చేర్చారు. యశ్‌పాల్ టీమిండియా తరపున 1978- 83 మధ్య కాలంలో మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్‌గా కీలకపాత్ర పోషించారు. భారత్ తరపున ఆయన 37 టెస్టులు, 42 వన్డేలు ఆడారు. టెస్టుల్లో 1606, వన్డేల్లో 883 రన్స్ చేశారు. అయితే 1985లో తలకు గాయం కావడంతో అంతర్జాతీయ క్రికెట్‌కు ఆయన వీడ్కోలు పలికారు.
ఎన్నో జ్ఞాపకాలు:
యశ్‌పాల్ శర్మ మృతి పట్ల మాజీ క్రికెటర్లు సంతాపం తెలిపారు. యశ్‌పాల్ మృతి ఎంతో షాక్‌కు గురి చేసిందని సచిన్ టెండూల్కర్ తెలిపారు. 1983 ప్రపంచకప్‌లో అతని బ్యాటింగ్ శైలిని చూసి ఎంజాయ్ చేసేవాడినన్నారు. ఎన్నో జ్ఞాపకాలు మిగిలి ఉన్నాయన్నారు. శర్మ కుటుంబానికి ఆయన నివాళి అర్పించారు. వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, వెంకటేశ్ ప్రసాద్, అనిల్ కుంబ్లే, శిఖర్ ధావన్ సహా మరికొంతమంది క్రికెటర్లు యశ్‌పాల్ మృతి పట్ల నివాళి అర్పించారు.


Click it and Unblock the Notifications












