Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

50 గంటలు, 14వేల బంతులు: వడాపావ్ అమ్మే విరాగ్ క్రికెట్ గిన్నిస్ రికార్డ్

ముంబై: మహారాష్ట్రకు చెందిన క్రికెటర్ విరాగ్ మారె గిన్నిస్ రికార్డ్ సృష్టించాడు. లాతూర్‌కు చెందిన విరాగ్ ఏకంగా మూడు రోజుల పాటు నెట్స్‌లో బ్యాటింగ్ చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకున్నాడు. 24 ఏళ్ల విరాగ్ నెట్స్‌లో 50 గంటల 5 నిమిషాల, 52 సెకన్ల పాటు బ్యాటింగ్ చేశాడు.

అంతేకాదు ఆ సమయంలో 2,447 ఓవర్లలో 14,682 బంతులు ఎదుర్కొన్నాడు. పుణేలోని కార్వెనగర్‌లో మహాలక్ష్మీ లాన్స్‌లో డిసెంబర్ 20 - 23 తేదీల్లో అతను ఈ ఫీట్ చేశాడు. దీంతో ఇంగ్లాండుకు చెందిన డవే న్యూమాన్, రిచర్డ్స్ వేల్స్ పేరిట ఉన్న 48 గంటల రికార్డ్ బద్ధలైంది.

Indian cricketer Virag breaks Guinness record for longest net session

నెట్స్‌లో విరాగ్‌కు బౌలింగ్ కోసం బౌలర్లతో పాటు బౌలింగ్ యంత్రాలను ఉపయోగించారు. అతను గంటకోసారి విశ్రాంతి తీసుకుంటూ బ్యాటింగ్ చేశాడు. 24 గంటలు బ్యాటింగ్ చేశాక విరాగ్ బాగా అలసిపోయాడు. ఈ దశలో తండ్రితో పాటు సహచరుల ప్రోత్సాహంతో బ్యాటింగ్ కొనసాగించాడు.

అయితే, పదిహేనువేల బంతులు ఎదుర్కోవాలన్న అతని లక్ష్యం మాత్రం నెరవేరలేదు. కాగా, విరాగ్ మారె 16 ఏళ్ల వయస్సులో ముంబైలోని రమాకాంత్ అచ్రేకర్ (సచిన్ టెండుల్కర్ గురువు) అకాడమీలో చేరాడు. అయితే, ఫీజుకట్టలేక కొన్నాళ్లకే అకాడమీకి దూరమయ్యాడు. ఆ తర్వాత బతుకు దెరువు కోసం పుణేలో స్థిరపడ్డాడు. ప్రస్తుతం అతను వడాపావ్ బండిని నడుపుతున్నాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+