
ప్రపంచకప్ అనంతరం మళ్లీ చూడలేదు:
ప్రపంచకప్ జరుగుతుండగానే నెట్స్‌లో పేసర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌ను ఎదుర్కొంటూ విజయ్ శంకర్ గాయపడ్డాడు. గాయం తీవ్రమైనది కావడంతో టోర్నీ మధ్య నుంచే స్వదేశానికి వచ్చేశాడు. ఆ విజయ్‌ను మళ్లీ టీమిండియా జాతీయ జట్టులో చూడలేదు. నిజం చెప్పాలంటే.. ప్రపంచకప్ ముందు నిత్యం వార్తల్లో ఉన్న విజయ్.. ఆ టోర్నీ తర్వాత అతని పేరు ఒక్కసారి కూడా ఎక్కడా వినబడలేదు. అయితే ప్రస్తుతం విజయ్ శంకర్ దేశవాళీల్లో తమిళనాడు, భారత్-ఏ తరఫున క్రికెట్ ఆడుతున్నాడు.

విజయ్ బంగీ జంప్:
విజయ్ శంకర్ ఇటీవలే భారత్-ఏ తరఫున న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లాడు. అక్కడ అనధికార వన్డేలు, టెస్టులు ఆడాడు. కివీస్ టూర్ ముగియడంతో భారత్-ఏ ఆటగాళ్లు సరదాగా న్యూజిలాండ్‌లోని ప్రకృతి అందాలను ఎంజాయ్ చేశారు. ఇందులో భాగంగా గతంలో ఏ భారత క్రికెటర్ చేయని ఓ సాహసంను విజయ్ చేశాడు. న్యూజిలాండ్‌లో అత్యంత ఎత్తైన, ప్రమాకరమైన బంగీ జంప్ చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు.

28 కి.మీ వేగంతో కిందకు:
క్వీన్స్‌టౌన్‌లోని దక్షిణ ఆల్ప్స్ పర్వాతాల మధ్య బంగీ జంప్ వేదిక ఉంటుంది. అక్కడ రెండు కొండల మధ్య నెవిస్ నది ప్రవహిస్తుంటుంది. అటు ఇటు రోప్‌వే మాదిరిగా ఒక వేదిక కదులుతుంది. రోప్‌వే పర్వతాల మధ్యలోకి వచ్చాక అక్కడి నుంచి దూకేస్తారు. నెవిస్ బంగీ జంప్ ఎత్తు 134 మీటర్లు. ప్రపంచంలో అత్యంత ఎత్తైన వాటిలో ఇది మూడోది. అక్కడి దూకే వ్యక్తి గంటకు 128 కి.మీ వేగంతో కిందకు దూసుకెళుతాడు. తొలి 8 సెకన్లు ఫ్రీఫాల్ ఉంటుంది.

కుదిరితే అందరూ అందరూ చేయండి:
బంగీ జంప్ చేసేటప్పుడు ఆందోళన పడకుండా ఎంతో ధైర్యంతో ఉండాలి. భయం, ఆందోళనతో అసలు చేయరాదు. ఇలాంటి జంప్ చేయడం ఆషామాషీ కాదు. అలాంటి సాహస జంప్‌ను విజయ్ శంకర్ ధైర్యంగా చేసాడు. ఒక్కసారిగా దూకేసి ఎటువంటి బెరుకు లేకుండా తిరిగి పైకి చేరుకున్నాడు. అంతేకాదు తాను చేసిన బంగీ జంప్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. 'వావ్.. ఇది ఎంతో త్రిల్ అనిపించింది. నా ఒంట్లో అడ్రినలిన్ పొంగిపొర్లింది. న్యూజిలాండ్‌లో ఎత్తైన బంగీజంప్ ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు. కుదిరితే అందరూ ఇది చేయాలని కోరుతున్నా' అని రాసుకొచ్చాడు.
విజయ్ నువ్ తోపురా:
ప్రస్తుతం విజయ్ శంకర్ బంగీ జంప్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియో చూసిన అభిమానులు 'విజయ్ శంకర్ నువ్ తోపురా.. తురుమ్ రా' అంటూ ప్రశంస్తున్నారు. గతంలో వీవీఎస్ లక్ష్మణ్, సచిన్ టెండూల్కర్, జహీర్ ఖాన్, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్ ఆక్లాండ్‌లో స్కై వాకింగ్ చేశారు.


Click it and Unblock the Notifications
