Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సౌరవ్ గంగూలీకి 'ఛాలెంజ్' విసిరిన మిథాలీ రాజ్!!

Indian Cricketer Mithali Raj Planted Saplings in Hyderabad House, Throws Green Challenge to Sourav Ganguly

హైదరాబాద్: బీసీసీఐ అధ్యక్షుడు, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి టీమిండియా సీనియర్ వుమెన్ క్రికెటర్ మిథాలీ రాజ్ ఛాలెంజ్ విసిరారు. ఆ ఛాలెంజ్ మరేదో కాదు.. 'గ్రీన్ ఛాలెంజ్‌'. రాజ్యసభ ఎంపీ సంతోష్‌ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియాలో ఆదివారం మిథాలీ రాజ్ భాగమయ్యారు. ఈస్ట్‌జోన్ డీసీపీ రమేష్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్‌ను కెప్టెన్ మిథాలి రాజ్ స్వీకరించారు.

గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించిన మిథాలీ:

గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించిన మిథాలీ:

గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా హైదరాబాద్ నగరంలోని తిరుమలగిరిలో గల తన నివాసంలో మిథాలీ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మిథాలీ మాట్లాడుతూ... 'పర్యావరణహితం కోసం తన వంతు కృషి చేసే అవకాశం ఇచ్చిన డీసీపీ గారికి కృతజ్ఞతలు. ఈ మహా కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ సంతోష్‌కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. పర్యవరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలి. రాష్ట్రమంతా పచ్చదనంతో కళకళలాడాలని కోరుకుంటున్నా' అని అన్నారు.

గంగూలీకి ఛాలెంజ్:

ఈ సందర్భంగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, ప్రముఖ క్రీడాపాత్రికేయుడు బొరియా మజుందార్, పారిశ్రామిక వేత్త వాణి కోలా, నటి కాజల్ అగర్వాల్‌కు మిథాలీ 'గ్రీన్ ఛాలెంజ్' విసిరారు. ట్విట్టర్ వేదికగా మిథాలీ ఛాలెంజ్‌కు కాజల్ వెంటనే స్పందించారు. త్వరలోనే మొక్కలు నాటుతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మిథాలీతో పాటు గ్రీన్ ఛాలెంజ్ కో-ఫౌండర్ రాఘవ, కిషోర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మిథాలీ గ్రీన్ ఛాలెంజ్ ఫొటోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి.

 మిథాలీ బయోపిక్‌లో తాప్సీ:

మిథాలీ బయోపిక్‌లో తాప్సీ:

మిథాలీ రాజ్‌ బయోపిక్‌ వస్తున్న విషయం తెలిసిందే. ఈ బయోపిక్‌లో హీరోయిన్‌ తాప్సీ పన్నుటైటిల్‌ పాత్రలో నటించనుంది. మిథాలీ బర్త్‌డే సందర్భంగా తాప్సీ ఈ విషయంను అధికారికంగా వెల్లడించింది. 'శభాష్‌ మిథు' పేరుతో దర్శకుడు రాహుల్ ధోలాకియా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. వయాకామ్ 18 స్టూడియోస్ నిర్మిస్తోంది.

జులన్ గోస్వామిపై బయోపిక్:

జులన్ గోస్వామిపై బయోపిక్:

క్రికెట్ దిగ్గజాలైన ఎంఎస్ ధోనీ, సచిన్ టెండూల్కర్‌ల మీద వచ్చిన బయోపిక్స్ ఎంత పెద్ద హిట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. అదే స్ఫూర్తితో మిథాలీ జీవితక‌థ ఆధారంగా సినిమా తెరకెక్కుతోంది. మరోవైపు బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ బయోపిక్ కూడా సిద్దమవుతోంది. పరిణితీ చోప్రా హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ మూవీ కోసం బ్యాడ్మింటన్‌లో ఆమె ప్రత్యేక శిక్షణ తీసుకుంది. మహిళా క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా చరిత్ర నెలకొల్పిన ఫాస్ట్ బౌలర్ జులన్ గోస్వామిపై కూడా ఓ బయోపిక్ తీయనున్నారు.

Story first published: Sunday, December 22, 2019, 17:45 [IST]
Other articles published on Dec 22, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+