For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్రమోషన్: త్వరలో తండ్రి కాబోతున్న ఆల్ రౌండర్ జడేజా

టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు తండ్రిగా ప్రమోషన్ లభించనుంది. ప్రస్తుతం రవీంద్ర జడేజా భార్య రీవా సోలంకీ ఏడు నెలల గర్భవతి.

By Nageshwara Rao

హైదరాబాద్: టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు తండ్రిగా ప్రమోషన్ లభించనుంది. ప్రస్తుతం రవీంద్ర జడేజా భార్య రీవా సోలంకీ ఏడు నెలల గర్భవతి. ఆమె వచ్చే మే నెలలో ప్రసవించే అవకాశం ఉందని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

గతేడాది ఏప్రిల్ 17న గుజరాత్ వ్యాపారి కూతురు రీవా సోలంకిని జడేజా వివాహమాడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో రెండో టెస్టు ఆడుతున్న జడేజా తర్వలోనే తన భార్యను కలుసుకోనున్నాడు. జడేజా భార్య రీవా సోలంకీ మెకానికల్ ఇంజనీర్ కావడం విశేషం.

indian cricket team player ravindra jadeja to become father soon

రవీంద్ర జడేజా, సోలంకీల వివాహం రాజ్ కోట్‌లో జరిగింది. రాజ్ కోట్‌కు చెందిన కాంట్రాక్టర్, వ్యాపారవేత్త ఏకైక కుమార్తె రివా సోలంకీతో జడేజా వివాహం, అత్తవారి స్టార్ హోటల్‌లో జరిగిన సంగతి తెలిసిందే. బెంగుళూరు వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో రవీంద్ర జడేజా సత్తా చాటాడు.

తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 189 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా భారీ ఆధిక్యం సాధించకుండా జడేజా అడ్డుపడ్డాడు. తొలి ఇన్నింగ్స్‌లో జడేజా ఆరు వికెట్లు తీశాడు. దీంతో ఆస్ట్రేలియా 276 పరుగులకే ఆలౌటైంది.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+