
హైదరాబాద్: మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ కోసం కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా ప్రస్తుతం దక్షిణాప్రికాలో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సిరిస్ టీమిండియాకు ఎంతో ప్రతిష్టాత్మకం. ఎందుకంటే సఫారీ గడ్డపై భారత జట్టు ఇప్పటి వరకు ఒక్క టెస్టు సిరిస్ కూడా గెలవలేదు.
దీంతో కోహ్లీసేన ఎలాగైనా సరే ఈ టెస్టు సిరిస్‌ను గెలవాలనే పట్టుదలతో ఉంది. ప్రస్తుతం ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా అగ్రస్ధానంలో కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. భారత్ 124 రేటింగ్ పాయింట్లతో అగ్రస్ధానంలో ఉండగా, దక్షిణాఫ్రికా 111 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది.
అయితే సఫారీ గడ్డపై జరగనున్న మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో టీమిండియా వైట్ వాష్‌కు గురైన భారత అగ్రస్ధానానికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. ఎందుకంటే ఇరు జట్ల మధ్య 13 పాయింట్ల అంతరం ఉండటంతో టీమిండియా 0-3తో ఓడిపోయినా నెంబర్ వన్ ర్యాంకుకు ఎటువంటి నష్టం ఉండదు.
కోహ్లీసేన వైట్‌వాష్‌కు గురైనప్పటికీ, ఇరు జట్లు 118 పాయింట్లతో సమంగా ఉంటాయి. అయినప్పటికీ స్వల్ప తేడాతో భారత్ టాప్ ర్యాంక్‌లోనే కొనసాగనుంది. అదే సమయంలో కోహ్లీసేన ఈ సిరిస్‌ను క్లీన్‌స్వీప్ చేస్తే 128 పాయింట్లతో తన అగ్రస్ధానాన్ని మరింత పదిలం చేసుకుంటుంది.
మరోవైపు దక్షిణాఫ్రికా జట్టు 107 పాయింట్లకు పడిపోతుంది. ఇక టెస్టు ర్యాంకుల్లో రెండో స్థానంలో ఉన్న కెప్టెన్ విరాట్ కోహ్లీ (893) ఈ సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేస్తే 900 పాయింట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉంది. తద్వారా 900 రేటింగ్ పాయింట్లను సాధించిన తొలి భారత టెస్టు క్రికెటర్‌గా అరుదైన ఘనత సాధిస్తాడు.
మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా ఆతిథ్య దక్షిణాఫ్రికాతో జనవరి 5(శుక్రవారం) కేప్ టౌన్ వేదికగా తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.