Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

2020లో టీమిండియా పూర్తి షెడ్యూల్: టీ20 వరల్డ్‌కప్‌తో పాటు కోహ్లీసేన ముందున్న సవాళ్లివే!

Indian Cricket Team, full schedule for 2020 - Challenging year ahead for Virat Kohli and company

హైదరాబాద్: 2019ని టీమిండియా ఘనంగా ముగించింది. వరల్డ్‌కప్ సెమీస్‌లో ఆ ముప్పై నిమిషాలు మినహాయిస్తే గతేడాది టీమిండియా అద్భుత ప్రదర్శన చేసింది. టెస్టుల్లో అగ్రస్థానంతో ముగిసించిన టీమిండియా 2020లో కూడా కొత్త సవాళ్లను ఎదుర్కొనుంది. ప్రతి ఏటా లాగా ఈ ఏడాది కూడా క్రికెట్ అభిమానులకు ఎంతో విలువైంది.

ఎందుకంటే, అభిమానుల్ని ఉర్రూతలూగించేందుకు ఒలింపిక్స్‌తో పాటు టీ20 వరల్డ్‌కప్ లాంటి మెగా క్రికెట్‌ టోర్నీలు ఈ ఏడాదిలోనే జరగనున్నాయి. మరోవైపు న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలతో టీమిండియా ద్వైపాక్షిక సిరిస్‌ల్లో తలపడనుంది. ఈ ఏడాది జరిగే టీ20 వరల్డ్‌కప్‌కు ఆస్ట్రేలియా ఆతిథ్యమిస్తోన్న సంగతి తెలిసిందే.

టీమిండియా 2020 షెడ్యూల్‌ని ఒక్కసారి చూద్దాం...

భారత పర్యటనలో శ్రీలంక(జనవరి 5th - జనవరి 10th)
జనవరి 5, వేదిక: బరస్పర స్టేడియం, గౌహతి
జనవరి 7, వేదిక: హోల్కర్ స్టేడియం, ఇండోర్
జనవరి 10, వేదిక: ఎంసీఏ స్టేడియం, పూణె


భారత పర్యటనలో ఆస్ట్రేలియా(జనవరి 14th - జనవరి 19th)
జనవరి 14, వేదిక: వాంఖడే స్టేడియం, ముంబై
జనవరి 17, వేదిక: సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, రాజ్‌కోట్
జనవరి 19, వేదిక: ఓం చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు


న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా(జనవరి 24th - మార్చి 4th)
జనవరి 24, మొదటి టీ20; వేదిక: ఈడెన్ పార్క్, ఆక్లాండ్
జనవరి 26, రెండవ టీ20; వేదిక: ఈడెన్ పార్క్, ఆక్లాండ్
జనవరి 29, మూడో టీ20; వేదిక: సెడాన్ పార్క్, హామిల్టన్
జనవరి 31, నాలుగో టీ20; వేదిక: వెస్ట్‌పాక్ స్టేడియం, వెల్లింగ్టన్
ఫిబ్రవరి 2, ఐదవ టీ20; వేదిక: బే ఓవల్, మౌంట్ మౌంగనుయ్

ఫిబ్రవరి 5, మొదటి వన్డే; వేదిక: సెడాన్ పార్క్, హామిల్టన్
ఫిబ్రవరి 8, రెండవ వన్డే; వేదిక: ఈడెన్ పార్క్, ఆక్లాండ్
ఫిబ్రవరి 11, మూడో వన్డే; వేదిక: బే ఓవల్, మౌంట్ మౌంగనుయ్

ఫిబ్రవరి 21, మొదటి టెస్ట్; వేదిక: వెస్ట్‌పాక్ స్టేడియం, వెల్లింగ్టన్
ఫిబ్రవరి 29, రెండవ టెస్ట్; వేదిక: హాగ్లీ ఓవల్, క్రైస్ట్‌చర్చ్


భారత పర్యటనలో దక్షిణాఫ్రికా(మార్చి 12th - మార్చి 18th)
మార్చి 12, మొదటి వన్డే; వేదిక: హెచ్‌పిసిఎ స్టేడియం, ధర్మశాల
మార్చి 15, రెండవ వన్డే; వేదిక: అటల్ బిహారీ వాజ్‌పేయి స్టేడియం, లక్నో
మార్చి 18, మూడో వన్డే; వేదిక: ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా


ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) - (మార్చి 28th - మే 24th)
శ్రీలంక పర్యటనలో టీమీండియా - జులైజులైలో కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా శ్రీలంకలో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా టీమిండియా 3 వన్డేలు, 2 టీ20ల సిరిస్ ఆడనుంది. అయితే, ఈ పర్యటన యొక్క అధికారిక తేదీలు ఇంకా ఖరారు కాలేదు.


ఆసియా కప్- సెప్టెంబర్
ఈ ఏడాది ఆసియా కప్‌కు పాకిస్థాన్ ఆతిథ్యమిస్తోంది. పాక్ ఆతిథ్యమిస్తోండటంతో భారత్ ఆడుతుందా? లేదా అనేది అనుమానంగా మారింది. ఈ నేపథ్యంలో ఆసియా కప్‌ను తటస్థ వేదికలో నిర్వహించేందుకు జూన్‌లో ఆసియా కప్ నిర్వాహాకులు సమావేశం కానున్నారు.


ఇంగ్లాండ్ పర్యటనలో టీమిండియా - (సెప్టెంబర్ - అక్టోబర్ 2020)
ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌కు ముందు పరిమిత ఓవర్ల సిరీస్ కోసం నవంబర్‌లో టీమిండియా ఇంగ్లాండ్‌లో పర్యటించనుంది.


ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా - (నవంబర్ 2020)
మూడు మ్యాచ్‌ల సిరిస్ కోసం కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ పర్యటన తర్వాత టీమిండియా ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌కు సన్నద్ధమవుతుంది.


టీ20 ప్రపంచకప్ 2020
అక్టోబర్ 24: భారతదేశం vs దక్షిణాఫ్రికా, పెర్త్ స్టేడియం, పెర్త్
అక్టోబర్ 29: ఇండియా vs A2, మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్, మెల్బోర్న్
నవంబర్ 1: ఇండియా vs ఇంగ్లాండ్, మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్, మెల్బోర్న్
నవంబర్ 5: ఇండియా vs B1, అడిలైడ్ ఓవల్, అడిలైడ్
నవంబర్ 8: ఇండియా vs ఆఫ్ఘనిస్తాన్, సిడ్నీ క్రికెట్ గ్రౌండ్, సిడ్నీ


ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా, 2020
ఐసీసీ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా టీమిండియా వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ఆడనుంది. దీనికి ముందు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఇరు జట్లు తలపడతాయి.

Story first published: Thursday, January 2, 2020, 18:25 [IST]
Other articles published on Jan 2, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+