మీ వంటకాలొద్దు: కోహ్లీసేన కోసం గీత్ రెస్టారెంట్ నుంచి ప్రత్యేక భోజనం

హైదరాబాద్: కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా ప్రస్తుతం కోహ్లీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. పర్యటనలో భాగంగా భారత జట్టుకు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ఆధ్వర్యంలో అందిస్తున్న స్థానిక వంటకాలపై కోహ్లీసేన అసంతృప్తి వ్యక్తం చేసింది. స్థానిక వంటకాలను తినలేమని, మాకు భారతీయ వంటకాలు కావాలని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డుకు ఫిర్యాదు చేసింది.
దీంతో దక్షిణాఫ్రికా బోర్డు భారతీయ రెస్టారెంట్ నుంచి భోజనం తెప్పించే ఏర్పాటు చేసింది. ఇన్ని రోజులు ఇరు జట్లకు భోజనాన్ని ఒకే క్యాటరర్ అందించేంది. అయితే, తాజా ఫిర్యాదుతో దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ప్రిటోరియాలోని భారత్‌కు చెందిన గీత్ రెస్టారెంట్ నుంచి రుచికరమైన ఆహారం తీసుకొచ్చేందుకు నిర్ణయించింది.
ప్రస్తుతం ప్రిటోరియా నుంచి భారత్‌కు చెందిన రెస్టారెంట్ గీత్ నుంచి టీమిండియాకు రుచికరమైన భోజనాన్ని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ఏర్పాటు చేస్తోంది. ఈ సందర్భంగా గీత్ రెస్టారెంట్ మేనేజర్ మాట్లాడుతూ 'లోకల్ క్యాటర్ అందిస్తున్న భోజనంపై ఆటగాళ్లు సంతృప్తికరంగా లేకపోవడంతో దక్షిణాఫ్రికా బోర్డు మా రెస్టారెంట్‌ను ఎంపిక చేసింది. వాళ్లు ఆనందంగా మా భోజనాన్ని స్వీకరిస్తున్నారు. కేవలం భారత ఆటగాళ్ల, సిబ్బందికి మాత్రమే మా హోటల్ ఆహారాన్ని అందిస్తున్నాం' అని అన్నారు.
జోహాన్నెస్‌బర్గ్‌తో పాటు మిగతా వేదికల్లో జరిగే మ్యాచ్‌ల సమయంలో స్థానిక చెఫ్‌లను పక్కకు పెట్టి భోజనాన్ని తయారు చేయడానికి భారత చెఫ్‌లను మాత్రమే నియమించినట్లు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. మూడు టెస్టులు, ఆరు వన్డేలు, మూడు టీ20ల సిరిస్ ఆడేందుకు సఫారీ పర్యటనకు కోహ్లీసేన వెళ్లిన సంగతి తెలిసిందే.
మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను 2-1తో చేజార్చుకున్న కోహ్లీసేన ఆ తర్వాత ఆరు వన్డేల సిరిస్‌ను 5-1తో సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆదివారం జరిగే తొలి టీ20తో ఇరు జట్ల మధ్య మూడు టీ20 సిరిస్ ప్రారంభం కానుంది.
టీ20లు:
1st T20I: Feb 18, 2018, Sunday @ New Wanderers Stadium, Johannesburg
06:00 PM (IST)
2nd T20I: Feb 21, 2018, Wednesday @ Supersport Park, Centurion
09:30 PM (IST)
3rd T20I: Feb 24, 2018, Saturday @ Newlands, Cape Town
09:30 PM (IST)
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications