Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Rohith Sharma: తన ఫామ్ పై స్పందించిన రోహిత్ శర్మ..

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్ లేమి బాధపడుతున్నాడు. చెప్పుకోదగ్గ పరుగులు చేయడం లేదు. రోహిత్ రెండేళ్లలో టెస్ట్ ల్లో ఘోరంగా విఫలమవుతున్నాడు. మొత్తం 10 టెస్ట్‌ల్లో 18 ఇన్నింగ్స్‌ లు ఆడగా.. కేవలం 621 పరుగులు మాత్రమే చేశాడు. దీనిపై రోహిత్ శర్మ స్పందించాడు.
బ్రిస్బేన్ టెస్ట్ తర్వాత సరిగా ఫామ్ లో లేనని అంగీకరించాడు. అయితే అతను తన ఆటపై సంతృప్తిని వ్యక్తం చేశాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలోని మిగిలిన రెండు టెస్టుల బాగా ఆడతానని పేర్కొన్నాడు.

గబ్బాలో టెస్టు డ్రా అయిన తర్వాత, రోహిత్ తన బ్యాటింగ్ ఆర్డర్ పై కూడా మాట్లాడాడు. "నేను బాగా బ్యాటింగ్ చేయలేదు. దానిని అంగీకరించడం వల్ల నష్టమేమీ లేదు. కానీ నా మనసులో ఏముందో, నన్ను నేను ఎలా సిద్ధం చేసుకుంటున్నానో నాకు తెలుసు. నేను ఎక్కడ ఉన్నానో నాకు ఖచ్చితంగా తెలుసు. నా ఆటతో నేను చాలా సంతోషంగా ఉన్నాను" అని రోహిత్ చెప్పాడు. రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ పై కూడా రోహిత్ శర్మ మాట్లాడాడు. అశ్విన్‌కు హృదయపూర్వక వీడ్కోలు పలికాడు.

Indian cricket team captain Rohit Sharma reacts to his form

ఆస్ట్రేలియాతో మూడో టెస్టు తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని అశ్విన్ నిర్ణయించుకున్నాడని రోహిత్ చెప్పాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ప్రస్తుతం 1-1తో సమంగా ఉన్నందున, రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే సిరీస్ మధ్యలో అతని నిర్ణయం చాలా మందికి షాక్ ఇచ్చింది. వెటరన్ స్పిన్నర్ ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి మూడు టెస్ట్‌లలో ఒక టెస్ట్ లో మాత్రమే ఆడాడు. కాగా గబ్బాలో జరిగిన టెస్ట్ మ్యాచ్ డ్రా అయిన సంగతి తెలిసందే. ఈ మ్యాచ్ లో మొదటి ఇన్నింగ్స్ లో స్ట్రేలియా 445 పరుగులు చేసింది.

టిమిండియా మొదటి ఇన్నింగ్స్ లో 260 పరుగులు చేసింది. ఆసీస్ రెండో ఇన్నింగ్స్ 8 పరుగులకే డిక్లేర్ చేసింది. అయితే మ్యాచ్ వర్షం పదే పదే మ్యాచ్ కు అంతరాయం కలిగించడంతో మ్యాచ్ డ్రా అయింది.

Story first published: Wednesday, December 18, 2024, 18:13 [IST]
Other articles published on Dec 18, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+