Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

స్వదేశానికి చేరుకున్న రోహిత్ సేన..అభిమానులతో కలిసి ఆటగాళ్లు చిందులు

టీ20 ప్రపంచకప్-2024 ట్రోఫీని గెలుచుకున్న భారత క్రికెట్ జట్టు స్వదేశానికి చేరుకుంది. ప్రత్యేక విమానంలో భారత జట్టు గురువారం ఉదయం 6 గంటలకు భారత్‌ గడ్డకు చేరుకుంది.టీ20 ట్రోఫీతో వస్తున్న ఢిల్లీ విమానాశ్రయంలో టీమిండియా ఆటగాళ్లకు అభిమానులు ఘనస్వాగతం పలికారు. డప్పు చప్పుళ్లతో తమ భారత క్రికెటర్లకు అభిమానులు గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు. అభిమానులు ఆనందం చూసిన ఆటగాళ్లు సైతం వారితో కలిసి చిందులు వేశారు.

టీమిండియా ఆటగాళ్లు ముందుగా ప్రధాని నరేంద్ర మోదీని కలువనున్నారు. ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. అనంతరం ప్రత్యేక విమానంలో అక్కడ నుంచి ముంబైకు వెళ్లనున్నారు.2007 టీ20 ప్రపంచ కప్ మాదిరిగానే ముంబైలో టీమిండియా ఓపెన్ బస్సులో పరేడ్ చేయనుంది. సాయంత్రం 5 గంటలకు ముంబైలో ఆటగాళ్లు రోడ్ షోలో పాల్గొంటారు. రాత్రి వాంఖడేలో బీసీసీఐ భారత జట్టును సన్మానించనుంది.

Indian Cricket Team Arrived in delhi After T20 world cup

ఈ నేపథ్యంలో విక్టరీ పరేడ్‌లో క్రికెట్ అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వాస్తవానికి ప్రపంచ్ ముగిసిన వెంటనే భారత ఆటగాళ్లు స్వదేశానికి పయనం కావాల్సి ఉంది. అయిత బార్బడోస్‌లో తుఫాన్ కారణంగా, జట్టు అక్కడే ఉండాల్సి వచ్చింది. తుఫాన్ కారణంగా, బార్బడోస్‌లోని విమానాశ్రయం ఇప్పుడు మూసివేశారు. దీని కారణంగా ఆటగాళ్లు, వారి కుటుంబాలు, సహాయక సిబ్బంది, అధికారులు అందరూ అక్కడ చిక్కుకున్నారు. దీంతో ఆటగాళ్ల కోసం బీసీసీఐ ప్రత్యేక చార్టర్డ్ విమానాన్ని ఏర్పాటు చేసింది. దీని ద్వారా భారత ఆటగాళ్లు, సిబ్బంది గురువారం ఉదయం స్వదేశానికి చేరుకున్నారు.

Story first published: Thursday, July 4, 2024, 9:06 [IST]
Other articles published on Jul 4, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+