న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

2020 నుంచి 100 బంతుల టోర్నీ: ఆదరణ కోసం కోహ్లీ, ధోని

By Nageshwara Rao
Indian Cricket Stars Could Play In Englands New 100-Ball Tournament: Report

హైదరాబాద్: భారత క్రికెట్‌కు చెందిన పలువురు ఆటగాళ్లు త్వరలో వేరే టోర్నీల్లో కనిపించనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటివరకు భారత క్రికెటర్లు ఐపీఎల్‌లో కాకుండా మరే టీ20 టోర్నీలోనూ ఆడలేదు. అందుకు కారణం భారత క్రికెటర్లకు బీసీసీఐ వేరీ టోర్నీల్లో ఆడే అనుమతి ఇవ్వకపోవడమే.

2008లో ఐపీఎల్ ప్రారంభమవడం... సక్సెస్ సాధించడంతో ఆ తర్వాత బిగ్‌బాష్ లీగ్, బంగ్లా ప్రిమియర్ లీగ్, పాకిస్థాన్ సూపర్ లీగ్‌లాంటివి ఎన్ని వచ్చాయి. అయితే, ఈ లీగ్‌ల్లో భారత క్రికెటర్లను ఆడేందుకు బీసీసీఐ అంగీకరించలేదు. కాగా, యూసఫ్ పఠాన్‌ను చైనాలో జరిగే ఓ టీ20 టోర్నీకి అప్పట్లో అంగీకరించింది.

అయితే, ఆ తర్వాత పలువురు క్రికెటర్లు తమను కూడా వేరే లీగ్‌ల్లో ఆడేందుకు అనుమతి ఇవ్వాలని కోరడంతో యూసప్ పఠాన్ విషయంలో కూడా యూటర్న్ తీసుకుంది. అయితే టీ20 ఇన్నింగ్స్‌కు బదులు 100 బంతులు ఉండేలా మ్యాచ్‌ నిర్వహించే ప్రతిపాదనను ఇటీవలే ఇంగ్లాండ్‌ అండ్ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు తీసుకొచ్చింది.

2020 నుంచి ఇంగ్లాండ్‌లో 100 బంతుల ఫార్మాట్

2020 నుంచి ఇంగ్లాండ్‌లో 100 బంతుల ఫార్మాట్

2020 నుంచి ఇంగ్లాండ్‌లో మొదలయ్యే ఈ 100 బంతుల ఫార్మాట్ టోర్నమెంట్‌లో మాత్రం టీమిండియా క్రికెటర్లు విరాట్ కోహ్లీ, ధోనీలాంటి స్టార్ ప్లేయర్లు కనిపించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. నిజానికి ఐపీఎల్‌ను కాపాడుకోవడానికి బీసీసీఐ తమ ఆటగాళ్లను విదేశీ లీగ్‌లలో ఆడేందుకు అనుమతి ఇవ్వడం లేదు.

120 బంతులకు బదులు 100 బంతులు మాత్రమే

120 బంతులకు బదులు 100 బంతులు మాత్రమే

కానీ, ఈ బంతుల ఫార్మాట్‌ విషయంలో మాత్రం బోర్డు కాస్త వెనక్కి తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది 120 బంతులకు బదులు 100 బంతులు మాత్రమే ఆడే టోర్నీ. ఒక్కో ఇన్నింగ్స్‌లో వంద బంతులు మాత్రమే ఉండటం ఈ టోర్నీ ప్రత్యేకత అని డైలీ మెయిల్ ఓ వార్తా కథనంలో రాసుకొచ్చింది.

టోర్నీకి మంచి ఆదరణ దక్కుతుందని డైలీ మెయిల్ కథనం

టోర్నీకి మంచి ఆదరణ దక్కుతుందని డైలీ మెయిల్ కథనం

విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీ, రోహిత్ శర్మలాంటి ప్లేయర్స్ తొలి సీజన్‌లోనే ఆడితే ఈ టోర్నీకి మంచి ఆదరణ దక్కుతుందని డైలీ మెయిల్ తన కథనంలో పేర్కొంది. ఐపీఎల్ తొలి సీజన్లలో తమ ఆటగాళ్లను పంపడానికి అంతగా ఇష్టపడని ఇంగ్లాండ్ అండే వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఆ తర్వాత చాలా మందికి అనుమతి ఇచ్చింది.

100 బంతుల ఇన్నింగ్స్ ఇలా:

100 బంతుల ఇన్నింగ్స్ ఇలా:

ఈ ప్రతిపాదన ప్రకారం 15 ఓవర్ల వరకు ఓవర్‌కు ఆరు బంతులు వేయించి, పది బంతులతో చివరి ఓవర్‌ ఉండేలా ఈ కొత్త ఫార్మాట్‌ను ఇంగ్లాండ్ అండే వేల్స్ క్రికెట్ బోర్డు రూపొందించింది. అంతేకాదు 2020లో ఎనిమిది జట్లతో ఈ ఫార్మాట్‌లో టోర్నీ ఆడించడానికి ఇంగ్లాండ్‌ బోర్డు ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలుపెట్టింది.

Story first published: Friday, May 25, 2018, 18:15 [IST]
Other articles published on May 25, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X