భారత క్రికెట్ జట్టు కోచ్ గా కిర్ స్టన్?
ముంబయి: భారత క్రికెట్ జట్టు కోచ్ పగ్గాలను గారీ కిర్ స్టన్ చేపట్టే అవకాశాలున్నాయి. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) కోచ్ సెలెక్షన్ కమిటీ కిర్ స్టన్ తో మంగళవారం చర్చలు జరిపింది. ఇరు వర్గాలకు అంగీకారం కుదరడంతో కిర్ స్టన్ కోచ్ గా నియమితులయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన వచ్చే నెల మూడున కోచ్ గా పదవీ బాధ్యతలు చేపట్టవచ్చునని అంటున్నారు.కేప్ టవున్ లో క్రికెట్ క్లబ్ ను నడుపుతున్న దక్షిణాఫ్రికా జట్టు మాజీ ఓపెనర్ కిర్ స్టన్ తుది నిర్ణయాన్ని చెప్పిన తర్వాత అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించాలని బిసిసిఐ భావిస్తోంది. ఇంతకు ముందు దక్షిణాఫ్రికాకే చెందిన గ్రాహం ఫోర్డును బిసిసిఐ ఎంపిక చేసింది. అయితే ప్రకటన వెలుడిన తర్వాత ఆయన వెనక్కి తగ్గారు. దీంతో కిర్ స్టన్ నుంచి తుది నిర్ణయం వచ్చిన తర్వాతనే అధికారిక ప్రకటన చేయాలని బిసిసిఐ కోచ్ సెలెక్షన్ కమిటీ భావిస్తోంది. కిర్ స్టన్ తో బిసిసిఐ రెండేళ్ల కాంట్రాక్టు కుదుర్చుకుంటుంది.
Story first published: Tuesday, November 27, 2007, 23:53 [IST]
Other articles published on Nov 27, 2007
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications