For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సంపూర్ణ విజేత: యువరాజ్ సింగ్ రిటైర్మెంట్‌పై విరాట్ కోహ్లీ

 Indian Captain Virat Kohlis Tweet on Yuvraj Singh Retirement

హైదరాబాద్: 19 ఏళ్ల పాటు భారత క్రికెట్‌కు సేవలందించిన టీమిండియా వెటరన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ సోమవారం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. యువరాజ్ సింగ్ రిటైర్మెంట్‌పై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ట్విట్టర్‌లో స్పందించాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

కోహ్లీ తన ట్విట్టర్‌లో "అభినందలు పాజీ. దేశం తరుపున అద్భుతమైన క్రికెట్ ఆడావు. ఎన్నో అద్భుతమైన మధుర జ్ఞాపకాలతో పాటు గొప్ప విజయాలను మాకు అందించావు. నీకు ఆల్ ద బెస్ట్. సంపూర్ణ విజేత" అని ట్వీట్ చేశాడు.

యువరాజ్ సింగ్ ఆల్‌రౌండర్‌గా భారత జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ముఖ్యంగా టీమిండియాకు రెండు ప్రపంచకప్‌లు(వరల్డ్ టీ20 2007, వన్డే వరల్డ్ కప్ 2011) అందించడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ సందర్భంగా యువరాజ్ మాట్లాడుతూ ఇన్నేళ్లు తనను ప్రోత్సహించిన తన తల్లిదండ్రులకు, సహచరులకు, మిత్రులకు కృతఙ్ఞతలు తెలియజేస్తున్నట్టు చెప్పాడు.

"క్రికెట్‌ కోసం తన రక్తం, స్వేదం ధారపోశాను. క్యాన్సర్‌ బాధితులకు సాయం అందించడమే నా తదుపరి లక్ష్యం. జీవితంలో ఏ విధంగా పోరాడాలో క్రికెటే నేర్పింది. జీవితంలో నేను ఎప్పుడూ విశ్వాసం కోల్పోలేదు. క్రికెట్‌ ఆడటం.. తనకు పోరాడటం, పడటం.. లేవడం ముందుకు సాగడం నేర్పింది" అని యువీ భావోద్వేగానికి గురయ్యాడు.

Story first published: Monday, June 10, 2019, 16:06 [IST]
Other articles published on Jun 10, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+