T20 World Cup 2022: మళ్లీ నిరాశ పరిచిన రోహిత్ శర్మ.. 2 పరుగులకే పెవిలియన్ బాట పట్టిన హిట్‍మ్యాన్..

భారత్ కెప్టెన్ రోహిత శర్మ మళ్లీ నిరాశ పరిచాడు. టీ20 వరల్డ్ కప్ లో భాగంగా అడిలైడ్ లోని ఓవల్ స్టేడియంలో బంగ్లాదేశ్ తో జరుగుతున్న మ్యాచ్ లో తక్కువ పరుగులకే పెవిలియన్ చేరాడు. 8 బంతుల్లో 2 పరుగులు చేసి హసన్ మహమూద్ బౌలింగ్ లో యాసిర్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అయితే అప్పటికే రోహిత్ శర్మ క్యాచ్ ను బంగ్లా ఫీల్డర్లు మిస్ చేశారు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయిన రోహిత్ మళ్లీ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.రోహిత్ గత మూడు మ్యాచ్ ల్లో ఒక్క మ్యాచ్ లో హాఫ్ సెంచరీ చేశాడు.
పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో 7 బంతుల్లో 4 పరుగులకే చేశాడు. నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లో 39 బంతుల్లో 3 సిక్స్ లు, 4 ఫోర్లతో 53 పరుగులు చేశాడు. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో 15 పరుగులే చేశాడు. కాగా వరుసగా విఫలమవుతూ వస్తున్న కేఎల్ రాహుల్ బంగ్లాతో మ్యాచ్ లో హాప్ సెంచరీ చేశాడు. 32 బంతుల్లో 4 సిక్స్ లు, 3 ఫోర్లతో 50 పరుగులు చేశాడు. కేఎల్ రాహుల్ గత మ్యాచ్ ల్లో తక్కువ పరుగులకే ఔటయ్యాడు. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో 9 పరుగులకే పెవిలియన్ చేరాడు.
పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో 4 పరుగులు చేయగా.. నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లో 9 పరుగులే చేశాడు. అతన్ని టీమ్ నుంచి తప్పిస్తారని వార్తలు వచ్చాయి. కానీ జట్టు మేనెజ్ మెంట్ అతడిపై నమ్మకంతో తుది జట్టులోకి తీసుకుంది. దీంతో రాహుల్ కష్టపడి హాఫ్ సెంచరీ చేశాడు. ఉన్నతసేపు బంతిని స్టాడ్స్ లోకి తరలించే ప్రయత్నం చేశాడు. ఈ మ్యాచ్ లో ముందు భారత్ తుది జట్టులో ఒక మార్పు చేసింది. దీపక్ హుడా స్థానంలో అక్షర్ పటేల్ ను తీసుకుంది. అయితే జట్టు యాజమాన్యం ఈసారి కూడా రిషబ్ పంత్ కు మొండి చేయే చూపించింది. దినేష్ కార్తీక్ ఉండడంతో పంత్ ను తుది జట్టులోకి తీసుకోలేకపోయింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications