Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పీఎస్ఎల్‌ కోసం వెళ్లి.. పాకిస్తాన్‌లో చిక్కుకుపోన భారత బృందం!!

Indian broadcasting team left stranded in Pakistan after the suspension of PSL 2020 due to Coronavirus

కరాచీ: కోవిడ్-19 దెబ్బకు తాజాగా పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)ను వాయిదా వేస్తున్నట్టు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి వేలాదిమంది ప్రాణాలను బలితీసుకుంటున్న నేపథ్యంలో లీగ్‌ను వాయిదా వేస్తున్నట్టు పీసీబీ పేర్కొంది. పీఎస్ఎల్ నాకౌట్ దశకు చేరుకుంది. లాహోర్‌లో రెండు సెమీఫైనల్స్ జరగాల్సి ఉండగా.. లీగ్‌ను వాయిదా వేశారు. దీంతో ఆటగాళ్లు, సిబ్బంది సొంత ఇళ్లకు చేరుకుంటున్నారు. అయితే పీఎస్‌ఎల్ ప్రసారం కోసం పాకిస్తాన్‌కు వెళ్లిన భారత ప్రసార బృందం ఇప్పుడు చిక్కుల్లో పడింది.

పీఎస్ఎల్‌ కోసం పాకిస్తాన్‌కు:

పీఎస్ఎల్‌ కోసం పాకిస్తాన్‌కు:

పీఎస్‌ఎల్‌ మ్యాచ్‌లని ప్రసారం చేసేందుకు ఓ బ్రాడ్‌కాస్టర్ సంస్థ భారత్ నుంచి 29 మందిని పాకిస్తాన్‌కు పంపించింది. వీరందరు విమానంలో పాకిస్తాన్‌కు వెళ్లేందుకు భారత కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. విమానంలో అక్కడి వెళ్లిన సిబ్బంది పీఎస్‌ఎల్‌ టోర్నీ కరోనా వైరస్ దెబ్బకి అర్ధాంతరంగా నిలిచిపోవడంతో.. రోడ్డు మార్గం ద్వారా భారత్‌కు రావాలని ప్రయత్నించారు. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. మీకు విమానంలో వచ్చేందుకు మాత్రమే వీసా ఇచ్చింది కానీ.. రోడ్డు మార్గం ద్వారా కాదంటూ భారత సరిహద్దు సిబ్బంది వారికి తేల్చి చెప్పారు.

భారత్‌కు పంపిస్తాం:

భారత్‌కు పంపిస్తాం:

భారత సరిహద్దు సిబ్బంది రోడ్డు మార్గం ద్వారా వచ్చే సదరు ప్రసార బృందంను అడ్డుకోవడంతో.. వారందరు అక్కడే చిక్కుకుపోయారు. అయితే భారత ప్రసార బృందంను పాకిస్థాన్ నుంచి విమానంలో భారత్‌కి పంపేందుకు పాక్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందట. పీసీబీ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ... 'భారత ప్రసార బృందం గురువారం పాకిస్తాన్‌కు తిరిగి వస్తారు. వారు రెండు రకాల వీసాలు కలిగి ఉన్నారు. ఇక్కడికి వచ్చాక వారిని విమానంలో భారత్‌కు పంపిస్తాం' అని చెప్పాడు.

హేల్స్‌కి కరోనా లక్షణాలు కనిపించడంతో:

హేల్స్‌కి కరోనా లక్షణాలు కనిపించడంతో:

ప్రపంచమంతా కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తున్నా.. పాకిస్థాన్ మాత్రం తమ దేశంలో కరోనా వైరస్ లేదంటూ చెప్పుకొచ్చింది. అన్ని బోర్డులు క్రీడలను రద్దు చేస్తున్నా.. పీసీబీ మాత్రం పీఎస్‌ఎల్ టోర్నీని కొనసాగించింది. ఇంగ్లాండ్ క్రికెటర్‌ అలెక్స్ హేల్స్‌కి కరోనా వైరస్ లక్షణాలు కనిపించడంతో.. అప్రమత్తమైన పీసీబీ వెంటనే అతన్ని స్వదేశానికి పంపింది. ఆ విషయాన్ని రహస్యంగా ఉంచాలనుకుంది. కానీ క్రికెట్ కామెంటేటర్ రమీజ్ రాజా విషయం బయటకు చెప్పడంతో.. తప్పనిసరి పరిస్థితుల్లో పీఎస్‌ఎల్‌ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు పీసీబీ ప్రకటించింది.

Story first published: Thursday, March 19, 2020, 16:11 [IST]
Other articles published on Mar 19, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+