Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వరల్డ్ కప్: 'భారత బౌలర్లు జహీర్ లాగా ఫెర్ఫామ్ చేయాలి'

న్యూఢిల్లీ: ఢిపెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న టీమిండియా మళ్లీ ప్రపంచ కప్ గెలవాలంటే జహీర్ ఖాన్ లాంటి అత్యుత్తమ బౌలర్లు కావాలని ప్రముఖ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అభిప్రాపయపడ్డారు.

బుధవారం ఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోని, రోహిత్ శర్మ, అజ్యెంక రహానే లాంటి బ్యాట్స్ మెన్‌తో అద్భుతమైన బ్యాటింగ్ లైన్‌అప్‌తో టీమిండియా బలంగా ఉందన్నారు. ఎంతటి లక్ష్యాన్ని అయినా ఛేజ్ చేయగలిగిన సత్తా వారికి ఉందని అన్నారు.

Indian bowlers need to perform like Zaheer Khan to win WC: Harbhajan

వీరికి బౌలర్లు ఉమేష్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ సహకారం అందిస్తే తిరిగి ప్రపంచ కప్‌ను భారత్ సొంతం చేసుకుంటుందని చెప్పారు. ఆస్టేలియా పిచ్‌లు బౌన్సీ పిచ్‌లు కాబట్టి మంచి బౌలింగ్‌తో రాణిస్తే భారత్ ప్రపంచ కప్‌ను సాధిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు.

టీమిండియా 2011లో వరల్డ్ కప్‌ను గెలుచుకోవడంలో హర్బజన్ సింగ్ కీలక పాత్ర పోషించాడు. అంతర్జాతీయ క్రికెట్లో 101 టెస్టు మ్యాచ్‌లు ఆడిన భజ్జీ ఆస్టేలియా పిచ్‌లపై రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర పటేల్ మెరుగైన ప్రదర్శనను కనబర్చాలని చెప్పారు.

ఆస్టేలియా పిచ్‌లు ఫాస్ట్ బౌలర్స్‌కు అనుకూలం కాబట్టి, పవర్ ప్లే ఓవర్లలో స్పిన్నర్లను బౌలింగ్‌కు పిలవనప్పుడు 10-12 ఓవరల్లో వీరి సేవలను వినియోగించుకోవాలని సూచించాడు. భజ్జీ ఇప్పటి వరకు 229 వన్డే మ్యాచ్‌లు, 25 ట్వంటీ20 మ్యాచ్‌లు ఆడాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+