
పటిష్టంగా కనిపించిన ఆసీస్..
రెండో రోజు గంట సేపు మ్యాచ్ జరిగినా కూడా భారత బౌలర్లు ఎలాంటి ప్రభావం చూపలేకపోయారు. జడేజా, అక్షర్, సిరాజ్ ముగ్గురూ బ్యాటర్లను ఇబ్బంది పెట్టడంలో విఫలమయ్యారు. ప్రపంచ నెంబర్ వన్ టెస్టు బౌలర్‌గా ఎదిగిన అశ్విన్‌కు మాత్రం రోహిత్ బౌలింగ్ ఇవ్వలేదు.
దీంతో నెమ్మదిగా ఆసీస్ స్కరు బోర్డు పరగులు పెట్టింది. ఈ క్రమంలో ఒకానొక దశలో నాలుగు వికెట్ల నష్టానికి 186 పరుగులతో భారీ స్కోరు చేసేలా ఆసీస్ కనిపించింది. కానీ నిమిషాల వ్యవధిలోనే ఈ పరిస్థితి అంతా తలకిందులైంది.

మలుపు తిప్పిన అశ్విన్..
ఆట మొదలైన గంటన్నర తర్వాత మొట్టమొదటిసారి అశ్విన్‌కు రోహిత్ బంతిని అందించాడు. అంతే, ఇదే ఆటను మలుపు తిప్పింది. తను రెండో రోజు వేసిన రెండో ఓవర్లోనే హాండ్స్‌కోంబ్‌ను అశ్విన్ అవుట్ చేశాడు. ఆ తర్వాత కాసేపటికే అలెక్స్ క్యారీ (3)ని కూడా బుట్టలో వేసుకున్నాడు. అశ్విన్ డెలివరీని డిఫెండ్ చేసుకోవడానికి ప్రయత్నించిన అతను ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు.
ఇలాంటి సమయంలో అశ్విన్‌కు జోడీగా జడేజా పెద్దగా ఆకట్టుకోలేదు. రెండో రోజు ఆటలో అతను ఒక్కటంటే ఒక్క వికెట్ తీయలేకపోయాడు. అశ్విన్‌తో జత కట్టిన ఉమేష్ యాదవ్ మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగాడు. స్వదేశంలో అద్భుతంగా రాణించే యాదవ్.. ప్రమాదకరమైన కామెరూన్ గ్రీన్ (21)ను ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేర్చాడు.
వికెట్లు పంచుకున్న ఉమేష్, అశ్విన్
ఆ తర్వాత మళ్లీ బంతి అందుకున్న ఓవర్లో మిచెల్ స్టార్క్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. టాడ్ మర్ఫీ వికెట్లను కూడా గాల్లోకి ఎగరేశాడు. ఇలా చూస్తుండగానే మూడు వికెట్లు తీసుకున్నాడీ పేసర్. ఇక చివర్లో లియాన్‌ను అశ్విన్ క్లీన్‌బౌల్డ్ చేయడంతో ఆసీస్ ఇన్నింగ్స్ ముగిసింది. ఒకానొక దశలో 4 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసిన ఆసీస్.. 197 పరుగులకే ఆలౌట్ అయింది. అంటే కేవలం 11 పరుగులు మాత్రమే ఇచ్చి ఆరు వికెట్లు తీసుకున్నారు భారత బౌలర్లు.
ఈ ఆరు వికెట్లను అశ్విన్, ఉమేష్ చెరో మూడు కింద పంచుకున్నారు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు నిదానంగా ఆడుతోంది. మరి ఎవరు ఎంత స్కోరు చేస్తారో తెలియాలంటే మాత్రం వెయిట్ చేయకతప్పదు.


Click it and Unblock the Notifications












