న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ష‌మీకి అమెరికా వీసా నిరాకరణ.. బీసీసీఐ జోక్యం

Mohammed Shami’s US Visa Gets Approved After BCCI Writes To Embassy || Oneindia Telugu
Indian Bowler Mohammed Shamis US visa rejected, BCCI comes to his rescue

ముంబై: అమెరికా ప్రభుత్వం టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ షమీ వీసాను తిరస్కరించింది. ఈ విషయంలో బీసీసీఐ జోక్యం చేసుకోవడంతో చివరకు షమీకి వీసా జారీ అయినట్లు తెలుస్తోంది. విండీస్ పర్యటనకు వెళ్లేందుకు ష‌మీ వీసా కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్నాడు. అయితే ముంబైలోని అమెరికా ఎంబీసీ ష‌మీకి వీసా ఇచ్చేందుకు నిరాకరించింది.

ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌-7 ప్రత్యేక వార్తల కోసం

గృహహింస కేసు:

గృహహింస కేసు:

2018వ సంవత్సరంలో షమీ భార్య హాసిన్ జహాన్ అతనిపై గృహహింస కేసు పెట్టింది. జహాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోల్‌కతా పోలీసులు షమీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికీ షమీపై కేసు విచారణలో ఉంది. పోలీసుల రికార్డుల్లో కేసులు విచారణలో ఉన్నందున అమెరికా ఎంబీసీ వీసా ఇచ్చేందుకు సందేహం వ్య‌క్తం చేసింది.

బీసీసీఐ జోక్యం:

బీసీసీఐ జోక్యం:

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాహుల్ జోహ్రీ వెంటనే స్పందించి అమెరికా రాయబార కార్యాలయానికి లేఖ రాశారు. ష‌మీ దేశానికి ఎంతో సేవ చేశాడ‌ని, అత్యుత్త‌మ బౌల‌ర్ అని అమెరికా ఎంబ‌సీకి వెల్ల‌డించారు. షమీకి పీ వన్ కేటగిరి కింద అంతర్జాతీయ క్రీడాకారుడిగా గుర్తించి వీసా జారీ చేయాలని కోరారు. దీంతో ఎట్టకేలకు షమీకి అమెరికా వీసా జారీ అయినట్లు తెలుస్తోంది.

4 మ్యాచుల్లోనే 14 వికెట్లు:

4 మ్యాచుల్లోనే 14 వికెట్లు:

అమెరికాలోని ఫ్లోరిడాలో ఆగష్టు 3వ తేదీన వెస్టిండీస్‌తో తొలి టీ20 మ్యాచ్ ఉంది. అయితే ఆ మ్యాచ్‌లో ష‌మీ ఆడ‌డం లేదు. కానీ విండీస్ పర్యటన కోసం టీమిండియా జట్టు అమెరికా మీదుగా వెళ్లి రావాల్సి ఉంటుంది. అందు కోస‌మే ష‌మీ అమెరికా వీసా కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్నాడు. షమీ టీ20 సిరీస్‌కు ఎంపిక కాలేదు. వన్డే, టెస్ట్ సిరీస్‌కు ఎంపికయ్యాడు. తాజాగా ముగిసిన ప్రపంచకప్‌లో ష‌మీ అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చేసాడు. కేవ‌లం 4 మ్యాచుల్లోనే 14 వికెట్లు తీసుకున్నాడు.

మూడు ఫార్మాట్లకు కోహ్లీనే:

మూడు ఫార్మాట్లకు కోహ్లీనే:

టీమిండియా ఆగస్టు 3 నుంచి మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టు మ్యాచ్‌లు వెస్టిండీస్‌తో ఆడనుంది. ఈ నెల 29న టీమిండియా వెస్టిండీస్‌కు బయలుదేరనుంది. మూడు ఫార్మాట్లకు విరాట్‌ కోహ్లీనే కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. మొదటగా కోహ్లీ ఈ పర్యటనకు దూరంగా ఉంటాడని వార్తలొచ్చినా.. ఆ తర్వాత విశ్రాంతి అవసరం లేదని కోహ్లీ చెప్పిన విషయం తెలిసిందే. సీనియర్‌ వికెట్‌ కీపర్‌ ఎంఎస్ ధోనీ స్వయంగా తప్పుకోవడంతో యువ ఆటగాడు రిషబ్‌ పంత్‌ను వికెట్‌ కీపర్‌గా ఎంపిక చేశారు.

Story first published: Saturday, July 27, 2019, 15:18 [IST]
Other articles published on Jul 27, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X