Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Tilak Varma: ఐసీసీ టీ20 ర్యాంకింగ్ లో 3వ స్థానానికి చేరిన తిలక్ వర్మ..

దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్ లో సత్తా చాటిన తెలంగాణ ఆటగాడు తిలక్ వర్మ ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో దూసుకెళ్లాడు. టీ20 సిరీస్‌లో అతని తొలి సెంచరీతో సహా అతని అద్భుతమైన ప్రదర్శనల తర్వాత బ్యాటర్‌ల ర్యాంకింగ్స్‌లో 69 స్థానాలు ఎగబాకి 3వ స్థానంలో నిలిచాడు. భారత క్రికెట్‌ జట్టు ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా తన కెరీర్‌లో రెండోసారి టీ20 ఆల్‌రౌండర్‌గా నంబర్‌వన్‌గా నిలిచాడు. దక్షిణాఫ్రికా సిరీస్ లో ఆల్ రౌండ్ ప్రదర్శన చేయడంతో అగ్రస్థానంలో నిలిచాడు.

అతను బ్యాట్, బాల్ రెండింటిలోనూ రాణించాడు. ఇక తిలక్ వర్మ ప్రోటీస్‌తో జరిగిన సిరీస్‌లో తన రెండు సెంచరీలు చేశాడు. మొత్తం 280 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపికయ్యాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నాల్గో స్థానంలో నిలిచాడు. భారత బ్యాటర్ సంజూ శాంసన్ కూడా దక్షిణాఫ్రికాపై సత్తా చాటాడు. సంజు ప్రస్తుతం బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో 22వ స్థానానికి చేరుకున్నాడు. దక్షిణాఫ్రికా బ్యాటర్లు ట్రిస్టన్ స్టబ్స్ 23వ స్థానంలో ఉండగా.. హెన్రిచ్ క్లాసెన్ 59వ స్థానంలో కొనసాగుతూన్నాడు.

Indian batsman Tilak Verma moves up to 3rd spot in ICC Men s T20 Batsmen Rankings

ఐసీసీ పురుషుల టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో భారత లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ తొమ్మిదో ర్యాంక్‌ను సాధించాడు. ఆస్ట్రేలియా బౌలర్లు ఆడమ్ జంపా, నాథన్ ఎల్లిస్ కూడా పురోగతి సాధించారు. టీ20ల్లో బౌలర్ల ర్యాంకింగ్స్‌లో ఆదిల్ రషీద్, వనిందు హసరంగా తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. ఆడమ్ జంపా ఐదు స్థానాలు ఎగబాకి 3వ స్థానానికి చేరుకున్నాడు. మాజీ నంబర్ వన్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ ఒక స్థానం దిగజారి ప్రస్తుతం 8వ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు.

న్యూజిలాండ్‌పై సిరీస్ విజయం తర్వాత శ్రీలంక క్రికెటర్లు కూడా టీ20 ర్యాంకింగ్స్ లో దూసుకెళ్లారు. కుశాల్ మెండిస్ టీ20 ఇంటర్నేషనల్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో 12వ స్థానంలో నిలిచాడు. మహేశ్ తీక్షణ నిలకడైన ప్రదర్శనతో వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో ఆరో స్థానానికి చేరుకున్నాడు.
శ్రీలంక బ్యాటర్లు మెండిస్, అవిష్క ఫెర్నాండో ఇద్దరూ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌ను పురోగతి సాధించాడు. న్యూజిలాండ్‌కు చెందిన విల్ యంగ్ కూడా శ్రీలంకపై వరుస ఘన ప్రదర్శనల తర్వాత 22వ స్థానానికి చేరుకున్నాడు.

Story first published: Wednesday, November 20, 2024, 16:22 [IST]
Other articles published on Nov 20, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+