న్యూఢిల్లీ/హైదరాబాద్: భారత క్రికెట్ స్టార్స్ సురేష్ రైనా, శిఖర్ ధావన్‌లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో బుధవారం పాల్గొన్నారు. రైనా తన సొంత నగరంలో స్థానికులతో కలిసి స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. పరిశుభ్రత మన నాగరికతను సూచిస్తుందని అభిప్రాయపడ్డారు. జాతిపిత మహాత్మా గాంధీ కలగన్న క్లీన్ ఇండియా సాకారమయ్యేందుకు మరెంతో దూరం లేదన్నారు. ప్రధాని ప్రారంభించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నందుకు తాను ఎంతో సంతోషిస్తున్నానని తెలిపారు.
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మన బాధ్యత అన్నారు. స్వచ్ఛ భారత్‌ను భారతీయులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని సూచించారు. సామాజిక అనుసంధాన వెబ్ సైట్లో తన అభిమానులకు కూడా పిలుపునిచ్చారు. స్వచ్ఛ భారత్ దేశభక్తిని చాటుతుందని అభిప్రాయపడ్డారు. ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు.
కాగా, 27 ఏళ్ల రైనా యూపీ టీమ్ మేట్స్ పలువురిని స్వచ్ఛ భారత్‌కు నామినేట్ చేశారు. ప్రవీణ్ కుమార్, పీయుష్ చావ్లా, ఆర్పీ సింగ్, బీసీసీ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా, హాకీ ప్లేయర్ శ్రీజేష్, బాలీవుడ్ గాయకులు శ్రేయా ఘోషల్, సోను నిగమ్, బ్యాడ్మింటన్ ప్లేయర్లు సైనా నెహ్వాల్, కే శ్రీకాంత్ తదితరులను నామినేట్ చేశారు.