For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'గుడ్‌ లక్‌.. ప్రపంచకప్‌ను భారత్‌కు తీసుకురావాలి'

Indian batsman Suresh Raina ahead of the India and Pakistan mega clash expressed confidence that Pakistan would not be able to rout India on June 16, 2019 in Manchester. The middle-order aggressive Indian batsman has his hopes high for the biggest clash of the tournament between arch rival India and Pakistan at Old Trafford in Manchester as he stated if India does well in the initial matches then Pakistan’s clash would not be a worry.

టీమిండియాకు గుడ్‌ లక్‌. చరిత్రను తిరగరాయాల్సిన సమయం వచ్చింది. టీమిండియా ప్రపంచకప్‌ను భారత్‌కు తీసుకురావాలి అని టీమిండియా సీనియర్ క్రికెటర్‌ సురేష్‌ రైనా పేర్కొన్నాడు. మరికొన్ని గంటల్లో భారత్ ప్రపంచకప్‌ తొలి మ్యాచ్ ఆడనుంది. టోర్నీలో భాగంగా బుధవారం మధ్యాహ్నం సౌతాంఫ్టన్ వేదికగా దక్షిణాఫ్రికాతో భారత్ తలపడనుంది. ప్రపంచకప్‌లో ప్రొటీస్ జట్టుకు మూడో మ్యాచ్ కాగా.. టీంఇండియాకు తొలి మ్యాచ్.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

టీంఇండియా తొలి మ్యాచ్ ఆడనున్న నేపథ్యంలో అభిమానులతో పాటు క్రికెటర్లు కూడా ఆల్ ది బెస్ట్ చెపుతున్నారు. సురేష్ రైనా కూడా ట్విట్టర్ వేదికగా గుడ్‌ లక్‌ చెప్పాడు. 'ఈ ట్వీట్ రాస్తుంటే.. లక్షల కొద్ది భావోద్వేగాలు, ఎన్నో మధుర జ్ఞాపకాలు నా మనస్సులో మెదులుతున్నాయి. చరిత్రను తిరగరాయాల్సిన సమయం వచ్చింది. గుడ్‌ లక్‌. టీమిండియా ప్రపంచకప్‌ను భారత్‌కు తీసుకురావాలి' అని రైనా ట్వీట్‌ చేశాడు.

1983లో మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ సారథ్యంలో భారత్ తొలిసారిగా ప్రపంచకప్‌ను ముద్దాడింది. మళ్లీ 28 ఏళ్ల తరువాత ఎంఎస్ ధోనీ (2011 ప్రపంచకప్‌) కప్ అందించాడు. సౌరవ్ గుంగూలీ సారథ్యంలో 2003 ప్రపంచకప్‌లో భారత్ ఫైనల్ చేరినా.. ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పాలైంది. ఈసారి మంచి సమతూకంతో ఉన్న టీంఇండియా టోర్నీ ఫేవరేట్ గా బరిలోకి దిగుతోంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ తొలిసారిగా ప్రపంచకప్‌లో సారధ్య బాధ్యతలు చేపట్టనున్నాడు. అయితే కోహ్లీకి మాత్రం ఇది మూడో ప్రపంచకప్‌. ఇంతకు ముందు 2011, 2015 ప్రపంచకప్‌లలో ధోనీ సారథ్యంలో కోహ్లీ ఆడాడు. ఈ ప్రపంచకప్‌లో కూడా కోహ్లీకి ధోనీ సూచనలు ఇవ్వనున్నాడు.

Story first published: Wednesday, June 5, 2019, 14:43 [IST]
Other articles published on Jun 5, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+