బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా పై మొదటి టెస్ట్ లో గెలిచిన టీమిండియా ఊపు మీద ఉంది. భారత్ రెండో టెస్ట్ కు సిద్ధమవుతుంది. వ్యక్తిగత కారణాలతో తొలి టెస్ట్ కు దూరమైన కెప్టెన్ రోహిత్ శర్మ అడిలైడ్ లో జరగనున్న డే అండ్ నైట్ టెస్ట్ కు అందుబాటులోకి రానున్నారు. రోహిత్ ఇప్పటికే ఆస్ట్రేలియా చేరుకున్నాడు. గాయం కారణంగా మొదటి టెస్ట్ లో ఆడని శుభ్ మన్ గిల్ రెండో టెస్ట్ లో ఆడడం సందేహంగానే మారింది. అతను గాయం నుంచి కోలుకోలేదని జాతీయ మీడియాల్లో కథనాలు వస్తున్నాయి.
ఆస్ట్రేలియాతో మొదటి టెస్ట్ మ్యాచ్ కు ముందు ప్రాక్టీస్ చేస్తుండగా శుభ మన్ గిల్ చేతి వేలికి గాయమైంది. కొన్ని వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని కుడిచేతి వాటం బ్యాటర్‌కు వైద్యులు సూచించారు. గిల్‌కి వైద్య నిపుణులు 10-14 రోజుల విశ్రాంతి తీసుకోవాలని చెప్పారు. భారత్ పింక్ బాల్ టెస్ట్ కు ముందు శనివారం నుంచి పింక్ బాల్ ప్రాక్టీస్ గేమ్ ఆడనుంది. ఈ ప్రాక్టీస్ మ్యాచ్ లో గిల్ ఆడడం లేదు. దీంతో అతను రెండో మ్యాచ్ కు కూడా అందుబాటులో ఉండకపోవచ్చని తెలుస్తోంది.

గాయం కారణంగా గిల్ రెండో, మూడో టెస్టుకు దూరమయ్యే అవకాశం ఉందని భారత మాజీ సెలెక్టర్ జతిన్ పరాంజపే అంచనా వేశారు. వేలు గాయాలు.. ముఖ్యంగా బొటన వేలికి తగిలిన గాయాలు నయం కావడానికి రెండు నుంచి నాలుగు వారాలు పడుతుందని ఆయన అన్నాడు. ఇది తన వ్యక్తిగత అనుభమని చెప్పాడు. "గిల్ రెండు మూడు టెస్టు మ్యాచ్‌లకు దూరమైనా ఆశ్చర్యపోవద్దు" అని పరాంజపే పేర్కొన్నాడు. భారత బ్యాటింగ్ లైన్ ప్ లో గిల్ కీలక ఆటగాడిగా ఉన్నాడు.
దాదాపు నాలుగేళ్ల క్రితం భారత ఆస్ట్రేలియా పర్యటనలో గిల్ అరంగేట్రం చేశాడు. బ్రిస్బేన్‌లోని గబ్బాలో జరిగిన నాల్కో, చివరి టెస్టులో అద్భుత ప్రదర్శన చేశాడు.అప్పటి నుంచి గిల్ ఆల్-ఫార్మాట్ బ్యాటర్‌గా స్థిరపడ్డాడు. గిల్ అప్పటి ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్‌ను నంబర్ 3 బ్యాటింగ్ చేయడానికి అనుమతించమని అభ్యర్థించగా దానికి కోచ్ అంగీకరించాడు. అప్పటి నుంచి గిల్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తున్నాడు. 24 ఏళ్ల గిల్ ఇప్పటి వరకు 25 ఇన్నింగ్స్‌ల్లో 3 సెంచరీలతో 924 పరుగులు చేశాడు. అతని కెరీర్ సగటు 36.73 శాతంగా ఉంది.
గిల్ గాయంతో పాటు మొదటి టెస్టులో రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో లేకపోవడంతో భారత్ తమ టాప్-ఆర్డర్‌లో కొన్ని మార్పులు చేయాల్సి వచ్చింది. యహ్సస్వి జైస్వాల్‌తో కలిసి కెఎల్ రాహుల్ ఓపెనర్లుగా వచ్చాయి. రోహిత్ శర్మ ఇప్పుడు తిరిగి జట్టులోకి రావడంతో రాహుల్ మిడిల్ ఆర్డర్ లో వచ్చే అవకాశం ఉంది. గిల్ సకాలంలో ఫిట్‌నెస్‌ను తిరిగి పొందడంలో విఫలమైతే రాహుల్ మూడో స్థానంలో రావచ్చు. రెండో టెస్ట్ లో దేవుదత్ పడిక్కల్‌కు అవకాశం ఉండకపొవచ్చని తెలుస్తోంది. డిసెంబరు 6న అడిలైడ్ వేదికగా రెండో టెస్టు జరగనుంది.