Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అర్జున అవార్డు: రోహిత్ పేరుని ప్రతిపాదించిన బీసీసీఐ

న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్, యువ క్రికెటర్ రోహిత్ శర్మ ప్రతిష్టాత్మక అర్జున అవార్డుకు నామినేట్ అయ్యాడు. ఈ మేరకు భారత క్రీడా మంత్రిత్వ శాఖకు బీసీసీఐ ప్రతిపాదనను పంపింది. అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో ఇప్పటి వరకు ఎవరూ సాధించిన రెండు సెంచరీల రికార్డులతో రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు.

2014లో కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో శ్రీలంకపై జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ 173 బంతులు ఎదుర్కొని 264 పరుగులు సాధించి ప్రపంచ రికార్డుని నెలకొల్పాడు. అంతకముందు 2013లో ఆస్ట్రేలియాపై తొలి డబుల్ సెంచరీని నమోదు చేశాడు.

Indian batsman Rohit Sharma nominated for Arjuna award

భారత్‌ తరపున వన్డేల్లో సచిన్‌ టెండూల్కర్, సెహ్వాగ్‌ తర్వాత డబుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా రోహిత్‌శర్మ రికార్డు సాధించాడు. టీమిండియా తరుపున 138 వన్డేలాడి రోహిత్ శర్మ 4312 పరుగులు, 11 టెస్టులాడి 668 పరుగులు సాధించాడు.

టెస్టుల్లో రోహిత్ శర్మ అత్యధిక స్కోరు 177 పరుగులు కాగా, వన్డేల్లో రోహిత్ శర్మ సాధించిన 264 పరుగులే ప్రపంచ రికార్డు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+