For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అంతర్జాతీయ క్రికెట్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన తెలుగు క్రికెటర్

ప్రోలు రవీంద్ర అనే తెలుగు యువ క్రికెటర్ అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.

By Nageshwara Rao

హైదరాబాద్: ప్రోలు రవీంద్ర అనే తెలుగు యువ క్రికెటర్ అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. కేవలం 29 బంతుల్లోనే సెంచరీ సాధించి క్రిస్ గేల్, డివిలియర్స్ అరుదైన రికార్డుని నెలకొల్పాడు.

ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన ప్రోలు రవీంద్ర క్రికెట్లో మెళకులు నేర్చుకునేందుకు బెంగళూరు వలస వెళ్లాడు. టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ని అభిమానించే రవీంద్ర ఇటీవల కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అకాడమీ నిర్వహించిన పోటీల్లో 58 బంతుల్లోనే 144 పరుగులు చేశాడు.

Indian Batsman Prolu Ravindra Tears Into Record Books, Makes 29-Ball Century In A Karnataka Tournament Game

రవీంద్ర ఇన్నింగ్స్‌లో 13 సిక్సర్లు, 4 ఫోర్లు ఉన్నాయి. కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ నిర్వహించిన ఈ మ్యాచ్ బెంగళూరులోని రాజేశ్వరి నగర్‌ వేదికగా జరిగింది. సిటీ జింఖానా, జైదుర్ క్లబ్‌లు పోటీ పడ్డాయి. రవీంద్ర సెంచరీతో చెలరేగి పోవడంతో సిటీ జింఖానా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 403 పరుగులు చేసింది.

404 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన జైదూర్ క్లబ్ 229 పరుగులకే ఆలౌటైంది. కాగా ఢిల్లీకి చెందిన మోహిత్ అహ్లవత్ టీ20ల్లో ట్రిపుల్ సెంచరీ బాది రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. అయితే అతడు ఆడినప్పుడు ఎన్ని బంతుల్లో సెంచరీ చేశాడో లెక్కించలేదు.

దీంతో 29 బంతుల్లో రవీంద్ర చేసిన సెంచరీనే అత్యంత వేగవంతమైందిగా రికార్డుల్లోకి ఎక్కింది. అంతర్జాతీయ వన్డే క్రికెట్లో ఏబీ డివిలియర్స్ 31 బంతుల్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన ఆటగాడిగా ఉన్నాడు. వెస్టిండిస్‌పై డివిలియర్స్
చేసిన ఈ సెంచరీయే అంతర్జాతీయ క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీ. అయితే ఇప్పుడు ప్రోలు రవీంద్ర అంతకంటే తక్కువ బంతుల్లోనే సెంచరీ చేయడం విశేషం.

Story first published: Monday, November 13, 2017, 12:16 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+