Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Viral: త‌గ్గెదేలే అంటూ పుష్ప డైలాగ్‌తో అద‌ర‌గొడుతున్న ర‌వీంద్ర జ‌డేజా

Indian All Rounder Ravindra Jadeja Says Allu Arjun Dialogue From Pushpa Movie

ఇటీవ‌ల ప‌లువురు క్రికెట‌ర్లు గ్రౌండ్‌లోనే కాదు, సోష‌ల్ మీడియాలోనూ త‌మ టాలెంట్‌ను చూపిస్తున్నారు. ప‌లు సినిమా డైలాగ్‌లను అనుస‌రిస్తూ దానికి త‌గ్గ‌ట్టే డైలాగ్‌లు చెబుతున్నారు. పాట‌ల‌కు త‌గ్గ‌ట్టు డ్యాన్స్‌లు కూడా చేస్తున్నారు. అది ఏ భాష సినిమా అయినా స‌రే. భాష‌తో సంబంధం లేకుండా త‌మ టాలెంట్‌తో అద‌ర‌గొడుతున్నారు. తాము ఆట‌ల్లోనే కాదు, సోష‌ల్ మీడియాలోనూ చురుకుగా ఉంటామని నిరుపించుకుంటున్నారు. ముఖ్యంగా తెలుగు భాష‌పై ఎక్కువ‌గా మ‌న‌సు పారేసుకుంటున్నారు. తెలుగు సినిమాల్లోని డైలాగులు చెబుతున్నారు.

వెనుక డైలాగ్ వ‌స్తుంటే దానికి త‌గ్గ‌ట్టుగా పెదాలు క‌దిలిస్తూ, ఎక్స్‌ప్రేషేన్స్‌తో దుమ్ములేపుతున్నారు. తెలుగు సినిమాల్లోని పాట‌ల‌కు డ్యాన్స్‌లు కూడా చేస్తున్నారు. వాటిని వీడియోలు తీసి సోష‌ల్ మీడియాలో పెడుతున్నారు. ఇంకేముందు అస‌లే క్రికెట‌ర్లు, పైగా ఓ సినిమాకు డైలాగులు చెబుతున్నారు. ఇక ఆ వీడియోల‌ను ఫ్యాన్స్ చూసి ఊరికే వ‌దిలేస్తారా? లైక్‌లు కొట్టి, కామెంట్స్ చేయ‌డ‌మే కాకుండా, షేర్‌ల‌తో సోష‌ల్ మీడియాను హోరెత్తిస్తున్నారు.

తాజాగా ఇలాంటి లిస్ట్‌లో మ‌రో క్రికెట‌ర్ కూడా చేరిపోయాడు. అత‌డే టీమిండియా ఆల్‌రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజా. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా త‌న సినిమా డైలాగ్‌ల‌తో సత్తా చూపెట్టాడు జ‌డ్డూ భాయ్‌. అది కూడా తెలుగు సినిమాకు సంబంధించిన‌ది కావ‌డం విశేషం. మైదానంలో ఒంటి చేత్తో మ్యాచ్‌లను గెలిపించే జ‌డేజా, సినిమా డైలాగుకు కూడా త‌న‌దైన రీతిలో ఎక్స్‌ప్రేష‌న్స్ ఇస్తూ దుమ్ములేపాడు. తెలుగులో ఇటీవ‌ల విడుద‌లైన చిత్రం పుష్ప‌. ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ హిరోగా, ర‌ష్మిక మంధాన హిరోయిన్‌గా తెర‌కెక్కిన చిత్రం ఇది. స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా.. దేవిశ్రీ ప్ర‌సాద్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేశారు. ఈ సినిమాలో హిరో అల్లు అర్జున్ చెప్పిన త‌గ్గెదేలే అనే డైలాగ్ ఎంత పాపుల‌ర్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు.

టీజ‌ర్ రిలీజ్ అయిన‌ప్ప‌టి నుంచే ఈ డైలాగ్ ట్రెండింగ్‌లో ఉంది. తాజాగా ఈ డైలాగ్‌కు త‌గ్గ‌ట్టుగా ఇన్‌స్టాగ్రామ్ రీల్ చేశాడు ఆల్‌రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజా. అచ్చం సినిమాలో అల్లు అర్జున్ లాగే గ‌డ్డం పెంచిన జ‌డేజా.. వెనుక వీడియో ప్లే అయితుంటే దానికి త‌గ్గట్టుగా న‌టించాడు. పుష్ప‌.. పుష్ప రాజు.. త‌గ్గెదేలే అనే డైలాగ్‌కు ఎక్క‌డ మిస్ కాకుండా పెదాలు జోడిస్తూ డైలాగ్ చెప్పి ఆకట్టుకున్నాడు జ‌డేజా. దానికి త‌గ్గ‌ట్టుగా ఎక్స్‌ప్రెషేన్స్ కూడా ఇవ్వ‌డం గ‌మనార్హం. దీంతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియో చూసి ఇటు ర‌వీంద్ర జ‌డేజా ఫ్యాన్స్‌, అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ తెగు ఖుషి అయిపోతున్నారు. వీడియోకు లైక్‌లు కొట్టి, కామెంట్లు చేయ‌డయే కాకుండా షేర్స్‌తో సోష‌ల్‌మీడియాను హోరెత్తిస్తున్నారు. దీంతో ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. కాగా గాయం కార‌ణంగా ఆల్‌రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజా సౌతాఫ్రికా ప‌ర్య‌ట‌నకు దూరంగా ఉన్న సంగ‌తి తెలిసిందే.

Story first published: Thursday, December 23, 2021, 20:55 [IST]
Other articles published on Dec 23, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+