Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నేడు ప్రపంచకప్‌కు భారత జట్టు ఎంపిక.. నాలుగో స్థానం ఎవరిది?

ICC Cricket World Cup 2019 : India's Squad For The ICC World Cup 2019 Will Be Announced On Monday
India World Cup squad to be named Today

మరికొన్ని గంటల్లో ప్రపంచకప్‌కు వెళ్లే భారత జట్టుపై పూర్తి స్పష్టత రానుంది. మే 30 నుంచి ఇంగ్లండ్‌లో జరిగే ప్రపంచకప్‌ కోసం 15 మంది సభ్యుల జట్టును ఎంపిక చేసేందుకు ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలోని సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ సోమవారం సమావేశమవుతోంది. ఈ సమావేశంలో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లితో పాటు కోచ్‌ రవిశాస్త్రి కూడా ఈ సమావేశంలో పాల్గొనే అవకాశాలున్నాయి.

నాలుగో స్థానం ఎవరిది:

నాలుగో స్థానం ఎవరిది:

ఆస్ట్రేలియా పర్యటనకు ముందు ప్రపంచకప్‌ జట్టు దాదాపు ఖరారైనట్లుగా అందరూ భావించారు. అయితే ఆసీస్ సిరీస్‌లో కొందరు ఆటగాళ్ల ప్రదర్శన సరిగా లేకపోవడంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. ముఖ్యంగా నాలుగో స్థానానికి పక్కా అనుకున్న రాయుడు.. ఆసీస్ సిరీస్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేదు. దీంతో రాయుడు స్థానంపై సందిగ్దత నెలకొంది. నాలుగో స్థానం ఆశిస్తున్న కేఎల్‌ రాహుల్‌ మాత్రం ఇటీవల బాగానే ఆడుతున్నాడు. ఐపీఎల్‌లో కూడా సెంచరీ చేసి అందరి దృష్టిలో పడ్డాడు. మరోవైపు ప్రత్యామ్నాయ ఓపెనర్‌ స్థానానికి కూడా రాహుల్‌ పోటీలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో రాహుల్‌కు చోటు పక్కాగా దక్కే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. రాయుడు నాలుగో స్థానంలో, రాహులు బెంచ్ ఓపెనర్ గా కూడా ఎంపికవచ్చు.

ధోనీకి ప్రత్యామ్నాయం?:

ధోనీకి ప్రత్యామ్నాయం?:

ప్రత్యామ్నాయ వికెట్‌ కీపర్‌ స్థానానికి ముందు నుంచి రేసులో ఉన్న దినేశ్‌ కార్తీక్‌ కూడా ఈ మధ్య సత్తా చాటలేదు. కార్తీక్‌కి పోటీగా మారిన రిషబ్‌ పంత్‌ వన్డేల్లో అడపాదపా రాణించాడు. దీంతో ధోనీకి ప్రత్యామ్నాయం ఎవరని పక్కాగా చెప్పలేం. అయితే సెలెక్టర్లు మాత్రం యువ ఆటగాడు రిషబ్‌ పంత్‌ వైపే మొగ్గుచూపుతున్నట్లు సమాచారం తెలుస్తోంది.

జడేజాకే ఓటేసే అవకాశం ఉంది:

జడేజాకే ఓటేసే అవకాశం ఉంది:

ఆల్‌రౌండర్‌ జాబితాలో జడేజా, విజయ్‌ శంకర్‌ మధ్య తీవ్ర పోటీ ఉంది. శంకర్‌ 9 వన్డేలే ఆడిన అనుభవం, స్లో మీడియం పేస్‌ బౌలింగ్‌ కారణంగా జడేజావైపే ఓటేసే అవకాశం ఉంది. ఎందుకంటే జడేజా కచ్చితత్వంతో కూడిన బౌలింగ్‌తో బ్యాట్స్‌మెన్‌ను కట్టడిచేయగలడు. పైగా జట్టులో అత్యుత్తమ ఫీల్డర్‌. బ్యాట్ తో చివరలో మ్యాచ్ ఫలితాన్ని కూడా మార్చేయగలడు. ఆస్ట్రేలియాతో రాణించడం జడేజాకు కలిసొచ్చే అంశం.

నాలుగో స్పెషలిస్టు పేసర్‌ వసరమనుకుంటే:

నాలుగో స్పెషలిస్టు పేసర్‌ వసరమనుకుంటే:

ఇంగ్లాండ్ పిచ్ లు కాబట్టి నాలుగో స్పెషలిస్టు పేసర్‌ను తీసుకోవాలనుకుంటే.. ఉమేశ్‌ యాదవ్‌, ఖలీల్‌ అహ్మద్‌ల్లో ఒకరిని ఎంచుకునే అవకాశముంది. నవదీప్‌ సైనీ పేరు ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఎలాగూ ముగ్గురు టాప్ పేసర్లు ఉన్నారు. వారికి తోడు పాండ్యా కూడా ఉన్నాడు కాబట్టి నాలుగో స్పెషలిస్టు పేసర్‌ అంశం తెరపైకి వచ్చే అవకాశం కూడా లేదు.

జట్టులో వీరు మాత్రం పక్కా:

జట్టులో వీరు మాత్రం పక్కా:

రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్, విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోని, కేదార్‌ జాదవ్, హార్దిక్‌ పాండ్యా, కుల్దీప్‌ యాదవ్, యుజువేంద్ర చహల్, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మొహమ్మద్‌ షమీ.

Story first published: Monday, April 15, 2019, 8:21 [IST]
Other articles published on Apr 15, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+